ఈ ఉగాది బ్లాక్‌బస్టర్‌ మూవీ ఎవరిదో…

Viswa
2 Min Read
2025 Ugadi Releaseing Movies

Web Stories

2025లో ఉగాది (Ugadi 2025 Movies), రంజాన్‌ ఫెస్టివల్స్‌ ఒకేసారి వస్తున్నాయి. దీంతో ఈ ఫెస్టివల్‌ సీజన్‌ను క్యాష్‌ చేసేందుకు సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ప్రధానంగా దక్షిణాదిలో ఐదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

మోహన్‌లాల్‌ ‘ఎంపురన్‌’  

మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డైరెక్షన్‌లోని ‘ఎంపురాన్‌’ మూవీ ఆడియన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్‌ చేసుకుంది. మోహన్‌లాల్‌ ‘లూసీఫర్‌’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఎంపురాన్‌’ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది.

విక్రమ్‌ వీరధీరశూర  

విక్రమ్‌ చేసిన లేటెస్ట్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘వీరధీరశూర’. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ ఈ సిని మాకు దర్శకత్వం వహించారు. దుషార విజయన్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా, ఎస్‌జే సూర్య విలన్‌గా చేశారు. ఈ మూవీ మార్చి 27న రిలీజ్‌ అవుతోంది.

నితిన్‌ రాబిన్‌హుడ్‌ (Robinhood)

‘భీష్మ’ వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తరవాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొం దుతున్న మూవీ ‘రాబిన్‌హుడ్‌’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. మంచి కమర్షి యల్‌ మూవీగా ‘రాబిన్‌హుడ్‌’ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, దేవ్‌ దత్తా…ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేశారు. ఈ చిత్రం మార్చి 28న థియేటర్స్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

మ్యాడ్‌ సీక్వెల్‌ (Mad2)

సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌లు హీరోలుగా చేసిన ‘మ్యాడ్‌’ మూవీ సూపర్‌హిట్‌. దీంతో ‘మ్యాడ్‌’ మూవీ డైరెక్టర్‌ ళ్యాణ్‌శంకర్‌ డైరెక్షన్‌లోనే ‘మ్యాడ్‌’ సీక్వెల్‌గా ‘మ్యాడ్‌ 2’ తీశారు. ‘మ్యాడ్‌ 2’లో కూడా సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌లు లీడ్‌ రోల్స్‌ చేశారు. ఈ ‘మ్యాడ్‌ 2’ మూవీ మార్చి 28నథియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

సల్మాన్‌ఖాన్‌  సికందర్‌ (Sikindar)

సల్మాన్‌ఖాన్‌ ‘సికందర్‌’ సినిమా జనవరి 30న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతోంది. కాజల్‌ అగర్వాల్‌ మరో లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేయగా, సత్యరాజ్‌ విలన్‌గా చేశారు. ఏఆర్‌ మురగదాస్‌ డైరెక్టర్‌. రాజ్‌కోట్‌తో మొదలైన ఈ మూవీ ఆ తర్వాత ముంబైలోకి వెళ్తుంది. ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఆడియన్స్‌ను అలరించనుంది.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi