Mad Square Review: మ్యాడ్‌ స్క్వేర్‌ (మ్యాడ్‌ 2) రివ్యూ

Mad Square Review: హిట్‌ మూవీ మ్యాడ్‌కు సీక్వెల్‌గా రూపొందిన మ్యాడ్‌ స్క్వేర్‌ రివ్యూ . సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌లు లీడ్‌ రోల్స్‌ చేశారు.

Viswa
4 Min Read
MAD SQUARE movie Review

కథ

Mad Square Review: అశోక్ కుమార్ (నార్నె నితిన్ ), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్ ), మనోజ్ (రామ్ నితిన్ ), గణేష్ అలియాస్ లడ్డు (విష్ణు)… ఇంజినీరింగ్ చదువులు పూర్తి చేసుకుంటారు. దామోదర్ పాలిటిక్స్ లోకి వెళ్తాడు. కానీ గ్రామ సర్పంచ్ గా కూడా గెలవడు. మనోజ్ ఓ మందు బార్ లో వెయిటర్ గా వర్క్ చేస్తుంటాడు. దోస్త్ లడ్డుతమకు చెప్పకుండ పెళ్ళి చేసుకుంటున్నాడని, అశోక్, మనోజ్, డీడీఆ పెళ్ళి కి వెళ్తారు. వాళ్ళ తో పాటు రాపిడో రఘు ను తీసుకువెళ్తారు. అక్కడ లడ్డు గాడు ఎదురు కట్నం ఇచ్చి పూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని అశోక్, మనోజ్, డీడీ లకు తెలుస్తుంది. ఇంతలో లడ్డు పెళ్ళి చేసుకోవాల్సిన పూజ ను రాపిడో రఘు లేపుకు పోతాడు. దింతో పెళ్ళి ఆగిపోయింది. బాధ పడుతున్న లడ్డు ను ఖుషి చేయడానికి, అశోక్, మనోజ్, డీ డీ, శివ ఆందరు గోవా వెళ్తారు. ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ గోవా లో అడుగు పెట్టి నప్పుడే… గోవా లోని మ్యూజీ యంలో పురాతన గొలుసు ఒకటి దొంగతనం చేయబడుతుంది. గోవా పోలీస్ సెబాస్టియన్ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ని అనుమానిస్తాడు. ఈ గొలుసు రాబరీ కి ప్లాన్ చేసిన గోవా మాఫియా లీడర్ మ్యాక్స్ కు కూడా ఈ గొలుసు చిక్కదు. మరి… ఈ విలువైన గొలుసు ఏమైంది? మ్యాక్స్ ను ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసిన సీబీఐ ఆఫీసర్ ఎవరు? పెళ్లి చేసుకోవాల్సిన లడ్డు ఎందుకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ

మ్యాడ్ ఫస్ట్ పార్ట్ లో… లడ్డు క్యారెక్టర్… కాలేజీ లో… జూనియర్స్ కి… తమ ఫ్రెండ్స్ గురించి చెబుతూ స్టోరీ మొదలవు తుంది. సెకండ్ పార్ట్ లో కూడా… సేమ్ ఫార్ములా (Mad Square). లడ్డు క్యారెక్టర్.. జైల్లో ఉండి తమ ఫ్రెండ్స్ గురించి చెప్పే సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డు మ్యారేజ్ సీన్స్ తోనే సాగుతుంది. కొన్ని హాస్య సన్నీ వేశాలు బాగున్నాయి. లడ్డు గ్యాంగ్ గోవా ట్రిప్ ప్లాన్ తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. మ్యూజియం లోని గొలుసును.. మ్యాడ్ గ్యాంగ్.. తమ దగ్గర కు ఎలా తెచ్చుకో గలిగారు అనే సీన్స్ తో సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఓ రొటీన్ క్లైమాక్స్ తో స్టోరీ కంప్లీట్ అవుతుంది (Mad 2)

మ్యాడ్ 2 లో స్టోరీ, లాజిక్… గట్రా ఏమి ఉండవని, జస్ట్ ఫన్ మాత్రమే ఉంటుందని మ్యాడ్ 2 నిర్మాత నాగవంశీ ముందే చెప్పాడు. ఇలా ఆడియన్స్ ని ప్రిపేర్ చేశాడు. అన్నట్లు గానే.. మ్యాడ్ 2 లో స్టోరీ ఏమి లేదు. పాత స్టోరీ లైన్ కి కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేశారు అంతే. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని పెళ్ళి సీన్స్ నవ్విస్తాయి. కానీ.. ఈ నవ్వులు సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఆడియన్స్ కొంత ఫోర్స్డ్ కామెడీ ఫీల్ అవుతారు. ముఖ్యంగా.. మ్యాడ్ గ్యాంగ్ పోలీస్ గేటప్ లు వేసిన ట్రాక్. పోలీస్ సెభాస్టియన్ ట్రాక్ లో ఫన్ పండలేదు. మాక్స్ గా సునీల్ పాత్ర చిత్రణ బాగున్నా.. మంచి కామెడీ సీన్స్ అయితే లేవు. లవ్ ట్రాక్ లు సినిమా లో లేవు. దింతో… స్పెషల్ సాంగ్స్ తో లాగించేసారు. అనుదీప్ క్యామియో ఓకే. పబ్ సీన్ పర్లేదు.

ఎవరు ఎలా చేశారంటే..

అశోక్‌ కుమార్‌గా నార్నే నితిన్‌ క్యారెక్టర్‌ ‘మ్యాడ్‌ 2’ (mad 2 Release) లో హైలైట్‌ అవుతుంది. ఈ పాత్రతో క్లైమాక్స్‌లో వచ్చే చిన్నపాటి ట్విస్ట్‌ పాతదే అయినా.. రివీల్‌ చేసిన విధానం బాగుంటుంది. ఇక దామోదర్‌గా సంగీత్‌శోభన్‌ యాక్టింగ్‌ బాగానే ఉంది. సినిమాలో మేజర్‌ లీడ్‌ క్యారెక్టర్‌గా ఉంటుంది. మ్యాడ్‌గ్యాంగ్‌ తొలిభాగంలో సంగీత్‌వే సీన్స్‌ అంతా. మనోజ్‌గా రామ్‌ నితిన్‌ క్యారెక్టర్‌ సైడ్‌ అయిపోతుంది. సినిమాలో యాక్టింగ్‌కు పెద్ద స్కోప్‌ ఉన్న రోల్‌ అయితే కాదు. ఇక గణేష్‌గా లడ్డు క్యారెక్టర్‌యే సినిమాకు సెంట్రల్‌ పాయింట్‌. ఆల్మోస్ట్‌ హీరోతో సమానమైన ఇంపార్టెన్స్‌ ఉంది క్యారెక్టర్‌లో. మేజర్‌ కామెడీ సీన్స్‌ ఈ రోల్‌ నుంచే వస్తాయి. ఒక ట్రెండు కామెడీ సీన్స్‌లో …మురళీధర్‌గౌడ్‌ ఫర్వాలేదనిపించాడు. సెకండాఫ్‌లో సునీల్‌ కాంబినేషన్‌తో వచ్చే
మురళీధర్‌ గౌడ్‌ సీన్స్‌ నవ్విస్తాయి. మ్యాక్స్‌గా, విలన్‌గా సునీల్‌ ఒకే. ఒకట్రెండు సీన్స్‌ నవ్విస్తాయి. పోలీస్‌ ఆఫీసర్‌ సెబాస్టియన్‌గా ‘సత్యం’ రాజేష్‌ ట్రాక్‌ నప్పలేదు. ఇక మ్యాక్స్‌ దగ్గర పనిచేసే వ్యక్తిగా శుభలేక సుధాకర్, గోవా పోలీస్‌ కమీషనర్‌గా అనీష్‌ కురువిళ్ల, హోటల్‌ ఓనర్‌గా రఘు బాబు..వంటి వాళ్లు వాళ్ల వాళ్ల పాత్రల పరిధి మేర చేశారు. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ కథపై ఇంకాస్త ఆర్గానిక్‌ కామెడీ ట్రై చేసి ఉండాల్సింది.లైలాగా ప్రియాంకా జవాల్కర్, స్పెషల్‌ సాంగ్‌లో రెబ్బా మౌనికా జాన్‌లు మెరిశారు. గెస్ట్‌ రోల్‌లో అనుదీప్‌ ఫర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు బాగు న్నాయి. భీమ్స్‌ మ్యూజిక్, తమన్‌ ఆర్‌ఆర్‌ ఒకే.

ఫైనల్‌గా…మ్యాడ్‌ కామెడీ..మ్యాగ్జిమమ్‌ కాదు.
రేటింగ్‌ 2.5/5

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *