Ramcharan Peddi Teaser: ఉగాదికి కాదు…శ్రీరామనవమికి..!

Ramcharan Peddi Teaser: శ్రీరామనవమి పండగ సందర్భంగా పెద్ది సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Viswa
1 Min Read
Ramcharan Peddi Movie Teaser3

రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘పెద్ది’ (Ramcharan Peddi Teaser). ఈ మల్టీస్పోర్ట్స్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌కు బుచ్చిబాబు సాన డైరెక్టర్‌. ఈ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ను రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఉగాది సందర్భంగానైనా పెద్ది మూవీ గ్లింప్స్‌ వస్తుందని చరణ్‌ ఆశించారు. కానీ అది జరగలేదు (Ramcharan Peddi Teaser)

కానీ ఉగాది పండగ రోజున…పెద్ది (Peddi) సినిమా గ్లింప్స్‌ను శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ వెల్లడించారు. ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొని ఉంది.

పెద్ది సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తుండగా, జగపతిబాబు, దివ్వేందు శర్మ, శివరాజ్‌ కుమార్‌లు ఇతర కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. తొలుత పెద్ది సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుందనే ప్రచారం సాగింది. కానీ వచ్చే ఏడాది రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భం గా మార్చి 26న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

మరోవైపు ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత రామ్‌చరణ్‌తో మరో మూవీ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. ఈ మూవీని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ వస్తుందని, ఆశించిన చరణ్‌ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *