Pawankalyan and AlluArjun: పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్‌ల మధ్య విభేదాలు తలెత్తెయ్యానే వార్తలు ఉన్నాయి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవి తారాస్థాయికి చేరాయి. అయితే ‘పుష్ప ది రూల్’ సినిమా ప్రీమియర్ ఇష్యూలో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైనప్పుడు, ఆ తర్వాతి మరుసటి రోజు చిరంజీవి ఇంటికి వెళ్లొచ్చారు. ఆ సమయంలో పవన్‌కళ్యాన్ ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చినా, అల్లు అర్జున్‌ను ఎందుకో కలవలేదు. అల్లు అర్జున్ కూడా పవన్‌కళ్యాణ్‌ను కలిశారన్న వార్తలు రాలేదు. వీరిద్దరు ఆ సమయంలో కలుసు కోబోతున్నారన్న వార్తలు మాత్రమే వచ్చాయి. ఇవి వార్తలుగానే మిగిలిపోయాయి.
తాజాగా పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్ కలసుకుని మాట్లాడుకున్నారని తెలిసింది..పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లోని ఓ ప్రవైటు స్కూల్‌లో గాయపడ్డారు. పవన్‌కళ్యాణ్, చిరం జీవి సింగపూర్ వెళ్లి, మార్క్ శంకర్‌ను తిరిగి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సానుభూతి తెలిపేందుకు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి….పవన్‌కల్యాణ్ ఇంటికి వెళ్లి, మాట్లాడారని సమా చారం.
అలాగే రీసెంట్ టైమ్‌లో గేమ్‌చేంజర్ విషయంలో అల్లు అర్జున్ తండ్రి, అల్లు అరవింద్…రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. ఇప్పుడు సందర్భానుసారంగా…అల్లు అర్జున్ వెళ్లి, పవన్‌కళ్యాణ్‌ను కలిశాడు..సో..మెగా, అల్లుల ఫ్యామిలీల మధ్య ఆల్ ఈజ్ వెల్ అని ఊహించుకోవచ్చు.
కాకపోతే..‘పుష్ప: ది రూల్’ సమయంలో మెగా యాంటీ ఫ్యాన్స్ కొందరు అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేశారు. ఇప్పుడు వాళ్లు ఏమని ఆలోచిస్తారో చూడాలి.