అజిత్ సూపర్భ్ యాక్టర్. అదే సమయంలో అజిత్ (Ajithkumar) మంచి ప్రొఫెషనల్ షూటర్. ఇంతకుమించి మంచి ప్రొఫెషనల్ రేసర్. రీసెంట్ టైమ్స్‌లో రేసర్‌గా అజిత్ చాలా బిజీగా ఉంటున్నాడు. మొన్నామధ్య ఓ రేసింగ్‌లో అజిత్ అండ్ టీమ్ విజేతలుగా కూడా నిలిచారు. అయితే రేసర్ (RacerAjithkumar)గా తన రీసెంట్ ట్రాన్ఫర్మేషన్ గురించి, అజిత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు చర్చనీయాంశమై య్యాయి. రేసర్‌గా ఉండేందుకు అజిత్ 42 కేజీల బరువు తగ్గారట. ఈ విషయంపై అజిత్ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
‘‘2024 ఆగస్టు నుంచి నేను ఇప్పటివరకు 42 కేజీల బరువు తగ్గాను. ఓ ప్రొఫెషనల్ రేసర్‌కి, ఆ మాత్రం తప్పదు. నాన్–వేజ్ మానేశాను. పూర్తిగా శాకాహారమే తీసుకుంటున్నాను. స్మిమ్మింగ్, సైక్లింగ్ వంటి అరోగ్యకరమైన వ్యాయామాలతో నేను ఈ బరువు తగ్గాను’’ అని చెప్పుకొచ్చారు అజిత్ (AK). యాక్టర్‌గా అజిత్ డెడికేషన్ సూపర్ అని చెబుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన తన రియల్‌లైఫ్ డెడికేషన్ కూడా నెక్ట్స్ లెవల్ అని, మరోసారి నిరూపించుకున్నారు.
ఇక యాక్టర్‌గా అజిత్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. నా నెక్ట్స్ మూవీ ఈ ఏడాది నవంబరులో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కావొచ్చు అని తన నెక్ట్స్ మూవీ గురించి అజిత్ పేర్కొన్నారు.