Akhanda 2: Thaandavam OTT Release: హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘అఖండ 2’ (Akhanda 2: Thaandavam OTT Release) . గత ఏడాది డిసెంబరు 12న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. ‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2’ (Akhanda 2: Thaandavam) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా పూర్తిగా సఫలం కాలేకపోయింది.
కాగా, ఈ ‘అఖండ 2’ సినిమా ఈ జనవరి 9 (Akhanda 2: Thaandavam OTT Streaming Date) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక అఖండ చిత్రంలో బాలమురళీకృష్ణ, సికిందర్ ఘోరాగా బాలకృష్ణ అన్నదమ్ముల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఇంకా ఈ ‘అఖండ 2’ సినిమాలో స్వస్థచటర్జీ, హర్షాలీ మల్హోత్రా, హీరోయిన్ సంయుక్త, కబీర్‌దుహాన్ సింగ్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతదేశంపై ద్వేషంతో చైనాకు చెందిన ఓ ఆర్మీ ఆఫీసర్, కుంభమేళాను వేదికగా చేసుకుని, భారతదేశంపై బయోవార్ ప్లాన్ చేస్తాడు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ తరుణంలో డీఆర్‌డీవో యంగ్ సైటింస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా) యాంటి డోట్‌ని రెడీ చేస్తుంది. దీంతో జననిని అడ్డుకోవడానికి శత్రువులు ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో జనని పెదనాన్న, సికందర్ ఘోర (బాలకృష్ణ) ఆమెకు ఎలా రక్షణగా నిలబడతాడు? సనాతనధర్మం ప్రాముఖ్యతను గురించి ఏం చెబుతాడు? అన్న అంశాల నేపథ్యంతో ‘అఖండ 2’ సినిమా కథనం సాగుతుంది.