ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనె (deepika padukone) తప్పుకున్నారు? అన్న వార్త వచ్చిన గంటల్లోనే అల్లు అర్జున్ (AlluArjun) మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా యాక్ట్ చేయనున్నారనే వార్త పుట్టుకొ చ్చింది. అల్లు అర్జున్ సినిమా చేసేందుకే, ‘స్పిరిట్’ (Spirit) నుంచి దీపికా పదుకునే తప్పు కున్నారా? లేక ‘స్పిరిట్’ సినిమా నుంచి సందీప్‌రెడ్డి వంగా తనను తప్పించినందుకు బదులుగా….అల్లు అర్జున్ సినిమాను దీపికా పదుకొనె యాక్సెప్ట్ చేశారా? అన్న విషయంపై చర్చ నడుస్తోంది.
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో దీపికా పదుకొనెది హీరోయిన్ రోల్. అల్లు అర్జున్ (AlluArjun) సినిమాలో కూడా హీరోయిన్ పాత్రే. కాకపోతే….దీపికా పదుకొనెతో పాటుగా, మరో నలుగురు హీరోయిన్స్ ఉంటారీ సినిమాలో…వీరిలో మృణాల్‌ఠాగూర్, జాన్వీకపూర్ పేర్లు ఆల్మోస్ట్ ఖరారైపోయాయి. రుక్మిణీవసంత్, భాగ్యశ్రీబోర్సేలతో చర్చలు జరుగుతున్నాయి. ఇంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అల్లు అర్జున్ మూవీని దీపికా యాక్సెప్ట్ చేయడానికి కారణాలు ఉండొచ్చు. అల్లు అర్జున్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. అట్లీ గత చిత్రం ‘జవాను’లో దీపికా పదుకొనె యాక్ట్ చేశారు. సో… ఈ విధంగా దీపిక వర్కింగ్ స్టైల్‌పై అట్లీకి, అట్లీ పనితీరుపై దీపికకు ఓ అవగాహన ఉంది. ఇలా అల్లు అర్జున్‌తో సినిమాను దీపిక యాక్సెప్ట్ చేయడంలో అట్లీది కీలక పాత్ర కావొచ్చు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది.