హరిహరవీరమల్లు రిలీజ్‌ వాయిదా..పవన్‌ సంచలన నిర్ణయం

Viswa
PawanKalyan HariHaraVeeraMallu Release postponed once again from june12

Web Stories

పవన్‌కల్యాణ్‌ (Pawankalyan) నుంచి ఓ సినిమా థియేటర్స్‌లోకి వచ్చి చాలా కాలమే అయ్యింది. పైగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్‌ నుంచి ‘హరిహరవీరమల్లు’ వంటి చారిత్రక చిత్రం వస్తుండటంతో, ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఈ హరిహరవీరమల్లు సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే (HHVM Postponed) ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా పవన్‌ కల్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’ (Pawankalyan Hariharaveeramallu) సినిమాకు సాంకేతిక పరమైన అడ్డంకులు ఏమీ లేకపోయినా, కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యల కారణంగా ‘హరిహరవీరమల్లు’ సినిమా రిలీజ్‌ వాయి దా పడుతుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’ సినిమా జూన్‌ 12న విడుదల కావడం లేదని, జూలైలో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నా హాలు చేస్తున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. ఈ రెండ్రోజుల్లో జరగనున్న కొన్ని కీలక పరిణామాల అనంతరం ‘హరిహరవీరమల్లు’ సినిమా రిలీజ్‌ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటివరకు హరిహరవీరమల్లు (HHVM Postponed) సినిమా రిలీజ్‌ విషయంలో, పవన్‌కల్యాణ్‌ తన అభిమానులకు పరోక్షంగా సారీ చెప్పటినట్లే అనుకోవచ్చు.

HHVM Postponed:అడ్వాన్స్‌ తిరిగిచ్చేసిన పవన్‌!

12ఏళ్ల తర్వాత అత్తారింటికి దారేది సెంటిమెంట్‌తో ఓజీ

హరిహరవీరమల్లు సినిమా రిలీజ్‌లో విషయంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని పవన్‌కల్యాణ్‌ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నిర్మాత ఏఏమ్‌రత్నంకు అండగా ఉండేందుకు పవన్‌ కల్యాణ్‌ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారట. తాను ఈ సినిమాకు గాను అడ్వాన్స్‌ రూపంలో తీసుకున్న రూ.11 కోట్ల రూపాయాలను తిరిగి ఇచ్చేయను న్నాడట పవన్‌కల్యాణ్‌. ఈ సమయంలో హరిహరవీరమల్లు సినిమాకు, పవన్‌ అడ్వాన్స్‌ ఇవ్వడం అనేది ఏంతో కొంత మేలు జరిగినట్లే. అయితే పవన్‌కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరో సినిమా, ఆర్థిక సమస్యల కారణంగా విడుదల నోచుకోవడం లేదంటే, అది కచ్చితంగా చిన్న విషయమైతే కాదు. మరి..పవన్‌కల్యాణ్‌ ‘హరిహరవీరమల్లు’ సినిమా ఏ తేదీకి విడుదల అవుతుందో, హరిహరవీరమల్లు సినిమా చుట్టూ ఉన్న చిక్కుముడులు ఎప్పుడూ విడిపోతాయో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు.

Please Share
4 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos