ఆనంద్‌దేవరకొండ రాంగ్‌ స్టెప్‌?

Viswa
1 Min Read
Anandh Devarakonda News ChenniLovestory Movie

Web Stories

‘బేబీ’ సినిమా ఆనంద్‌ దేవరకొండ (AnandDevarakonda)కు మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన వైష్ణవీ చైతన్యకూ మంచి ఫాలోయింగ్‌ వచ్చింది తెలుగు ప్రేక్షకుల్లో. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్లుగా మరో మూవీ చేయాల్సింది. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది. అదే ఇప్పటి చెన్నై లవ్‌స్టోరీ సినిమా.

ఇప్పుడు కిరణ్‌ అబ్బవరం, తెలుగు అమ్మాయి శ్రీ గౌరి ప్రియలు హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఈ చెన్నై లవ్‌స్టోరీ సినిమా (ChennaiLovestory Movie) చాన్స్‌ తొలుత ఆనంద్, వైష్ణవీలు చేయాల్సింది. కానీ సడన్‌గా.. .సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్యలకు సినిమా చేసే చాన్స్‌ వచ్చింది. ‘90స్‌’ వంటి సక్సెస్‌ఫుల్‌ వెబ్‌సిరీస్‌ తరవాత ఆదిత్యా హాసన్‌ చేస్తున్న మూవీ ఇది. ఓ రకంగా ‘90స్‌’కు సీక్వెల్‌ అనుకోవచ్చు. ఇది కూడా లవ్‌స్టోరీ మూవీయే. సితార వంటి మంచి బ్యానర్, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కావడంతో ఆనంద్‌ దేవరకొండ చెన్నై లవ్‌స్టోరీ సినిమాను వద్దనుకున్నట్లున్నాడు. కాల్షీట్స్‌ క్లాష్‌ అవ్వకుండ ఉంటే రెండు సినిమాలు చేసేవాడెమో. కానీ ఏదో ఒక సినిమానే చేయాల్సిన పరిస్థితి రావడంతో, సితారవైపు మొగ్గు చూపాడు ఆనంద్‌దేవరకొండ. అలాగే ఈ సితార సంస్థలో ఆనంద్‌దేవరకొండ అన్నయ్య, స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu