కమల్‌హాసన్‌- మణిరత్నంల గ్యాంగ్‌స్టర్‌ డ్రామా థగ్‌లైఫ్‌ ఎలా ఉంటుంది?

Viswa
Kamalhassan thugLife Pre and First Review

హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తొలిసారిగా వచ్చిన తమిళ చిత్రం ‘నాయగన్‌’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంతటి భారీ విజయం సాధించిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రావడానికి మాత్రం 38 సంవ్సరాల సమయం పట్టింది. ‘నాయగన్‌’ సినిమా తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కలిసి ‘థగ్‌లైఫ్‌’ (ThugLife Movie First Review) అనే సినిమా తీశారు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా (ThugLife Movie First Review)మూవీ జూన్‌ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విశేషాలు చూద్దాం.

కమల్‌హాసన్‌ ఐడియాతో..!

‘నాయకన్‌’ సినిమా తర్వాత కమల్‌హాసన్‌ (KamalHaasan Thuglife Review) తో దర్శకుడు మణిరత్నం (Manirathnam thuglife Review) ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ చేయాలనుకున్నాడు. కానీ కమల్‌హాసన్‌ ఆల్రెడీ ‘కల్కి2898ఏడీ’ మైథలాజికల్‌ అండ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో అసోసియేట్‌ అయ్యాడు. పైగా ఈ సినిమా రెండో పార్టు కూడా ఉంది. ఈ తరుణంలో మణిరత్నంతో కూడా సైన్స్‌ ఫిక్షన్‌ మూవీయే తీస్తే, కమల్‌ హాసన్‌ నుంచి రెండు వరుస సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలు ఆడియన్స్‌ ముందుకొచ్చినట్లవుతుంది. దీంతో తన దగ్గర ఉన్న థగ్‌లైఫ్‌ కథను మణిరత్నంకు వినిపించగా, కొన్ని మార్పులతో మణిరత్నం ఈ ‘థగ్‌లైఫ్‌’ సినిమాను ప్రకటించాడు. అలా ఈ ‘థగ్‌లైఫ్‌’ సినిమా ప్రారంభమైంది.

మారిన నటీనటులు

‘థగ్‌లైఫ్‌’ (Thuglife movie)  సినిమాలోని కీలక పాత్రల కోసం దుల్కర్‌సల్మాన్, రవి మోహన్‌ లను తీసుకున్నాడు మణిరత్నం. ‘థగ్‌లైఫ్‌’కి ముందు రవి మోహన్‌ (గతంలో ‘జయం’ రవి పేరు) తో మణిరత్నం ‘పొన్నియిన్‌సెల్వన్‌’ అనే మూవీ చేశాడు. ఈ సినిమా ప్రయాణంలో రవి మోహన్‌ నటన నచ్చి, ‘థగ్‌లైఫ్‌’ సినిమాలోనూ రవి మోహన్‌కు కమల్‌హాసన్‌ చాన్స్‌ ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ థగ్‌లైఫ్‌ సినిమా నుంచి రవి మోహన్‌ తప్పుకున్నాడు. ఈ పాత్రనే శింబు చేశాడు. అలాగే మరికొన్ని కారణాల వల్ల దుల్కర్‌సల్మాన్‌ సైతం ‘థగ్‌లైఫ్‌’ మూవీ నుంచి తప్పు కున్నా డు. దీంతో ఈ పోలీసాఫీసర్‌ పాత్రను అశోక్‌ సెల్వన్‌ చేశాడు.

ఇంప్రెసివ్‌ ట్రైలర్‌!

‘థగ్‌లైఫ్‌’ సినిమా ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. కథ రిత్యా కమల్‌హాసన్‌కు దత్తపుత్రుడులా ఉంటాడు శింబు (Simbu). అయితే వీరిద్దరి మధ్య మెయిన్‌ కాన్‌ఫ్లిక్ట్‌ క్రియేట్‌ అవుతుంది. ఈ కాన్‌ఫ్లిక్ట్‌ గ్యాంగ్‌స్టర్‌ రాజ్యానికి తానే కింగ్‌గా ఉండాలని శింబు నిర్ణయించుకున్నందుగా, లేక హీరోయిన్స్‌ త్రిష (thuglife trisha), అభిరామి (thuglife Aabhirami) పాత్రలతో ఏమైనా ముడిపడి ఉంటుందా? అనేది చూడాలి. కథ పరంగా త్రిష, అభిరామి, ఐశ్వర్యాలక్ష్మీల పాత్రలు చాలా బలంగా ఉండేట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమల్‌హాసన్‌–త్రిష పాత్రల మధ్య ఉన్న అంశమే సినిమాను మలుపుతిప్పే కాన్‌ఫ్లిక్ట్‌గా అనిపిస్తోంది. అలాగే ఈ మూవీలో కమల్‌హాసన్‌–శింబుల మధ్య ఎమోషనల్‌ అండ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు సినిమాలకు ప్రధాన హైలెట్‌గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీన్స్‌కి ఏఆర్‌ రెహహాన్‌ ఆర్‌ఆర్, మ్యూజిక్‌ కుదిరితే…థగ్‌లైఫ్‌ మూవీ నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.

ఇంకా ట్రైలర్‌లో కమల్‌హాసన్‌ డిఫరెంట్‌ గెటప్స్‌తో కనిపించారు. సో..ఈ సినిమా ఓ వ్యక్తి లైఫ్‌జర్నీగా ఉంటుందనిపిస్తోంది. అలాగే శింబు చిన్ననాటి సన్నివేశాలు సినిమాకు కీలకంగా ఉంటాయట. నాజర్, జోజూ జార్జ్‌ మెయిన్‌ విలన్స్‌గా ఉండొచ్చు. సాధారణంగా కమల్‌హాసన్‌ సినిమాలు కాస్త ఎక్కువ నిడివితోనే ఉంటాయి. అలా థగ్‌లైఫ్‌ సినిమా నిడివి కూడా ఎక్కువే. ఈ సినిమా నిడివి 2 గంటల నలభై నిమిషాలు.

విక్రమ్‌ సినిమాతో పోలికలు

ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తరహాలోనే మణిరత్నం దర్శకత్వంలో చెక్క చివాందవానమ్‌ సినిమా వచ్చింది. తెలుగులో నవాబుగా విడుదలైంది. ఈ మూవీతో థగ్‌లైఫ్‌ సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇది మూవీ రిలీజ్‌ తర్వాతే తెలు స్తుంది. అలాగే కమల్‌హాసన్‌ గత చిత్రం ‘విక్రమ్‌’ సూపర్‌హిట్‌. ఈ సినిమాలో చనిపోయిన దత్తపుత్రుడు కోసం పోరాడే తండ్రి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపిస్తాడు. ఇప్పుడు థగ్‌లైఫ్‌లో కూడా తన దత్తపుత్రుడు కోసం కమల్‌హాసన్‌ ఏం చేస్తాడు? అనేది కీలకంగా ఉండబోతుంది.

కర్ణాటకలో లేదు.

కోట్ల రూపాయలు నష్టం వచ్చినా..సరే..క్షమాపణలు చెప్పేది లేదు..కమల్‌హాసన్‌ మొండిపట్టు

థగ్‌లైఫ్‌ సినిమా కర్ణాటకలో విడుదల కావడం లేదు. తమిళ భాష నుంచే కన్నడ భాష వచ్చిందని, ఓ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడారు. దీనిపై వివాదం చేలరేగింది. కమల్‌హాసన్‌ క్షమాపణలు చెప్పాల్సినదిగా, కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోరగా, కమల్‌హాసన్‌ అంగీకరించలేదు. తప్పు చేయనప్పుడు క్షమాపణలు చెప్పనని చెప్పేశాడు. కర్ణాటకలో ‘థగ్‌లైఫ్‌’ సినిమా రిలీజ్‌ కోసం కమల్‌హాసన్‌ కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో కర్ణాటకలో కమల్‌హాసన్‌ ‘థగ్‌లైఫ్‌’ సినిమా విడుదల కావడం లేదు. ఇది ఆర్థికంగా కమల్‌హాసన్‌ టీమ్‌కు కాస్త ఇబ్బందే అని చెప్పవచ్చు.

టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీ రివ్యూ (ఓటీటీ)..జగమంతా కుటుంబంనాది!

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *