విశ్వంభర (Vishwambhara Movie) సినిమాపై ఇండస్ట్రీలో, మెగా ఫ్యాన్స్‌పై అంచానలు ఉన్నాయి. ‘బింబిసార’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా చేస్తుండటం, చాలా కాలం తర్వాత చిరంజీవి (Hero Chiranjeevi) సోషియో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ చేస్తుండటం ఇందుకు కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ‘విశ్వంభర’ సినిమా రిలీజ్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మేకర్స్ అయితే ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అక్టోబరులో ఈ సినిమా రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఒక సాంగ్ తప్ప షూటింగ్ పూర్తయింది. ఈ సాంగ్‌లో చిరంజీవి పాత సినిమాల హిట్స్ పాటల్లోని థీమ్స్‌ని వాడబోతున్నారు. ఇక ఈ పాటలో మౌనీరాయ్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నెల ఆఖర్లో ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. అయితే ‘విశ్వంభర’ సినిమా గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయని, కేవలం 20 శాతం మాత్రమే పెడింగ్ ఉందని, ఇది కూడా పూర్తయితే రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత ఇస్తామని దర్శకుడు వశిష్ఠ చెబుతున్నాడు. అలాగే ఈ విశ్వంభర సినిమా స్టోరీ (Vishwambhara movie Story) విషయాలను కూడా తెలిపారు.
”జగదేకవీరుడు అతిలోకసుందరి, కీలుగుర్రం, పాతాళభైరవి’ వంటి సినిమాలు నాకు స్ఫూర్తి. ఈ ప్రేరణతోనే ‘విశ్వంభర’ కథను రెడీ చేశాడు. మనకు పైన 7 లోకాలు, పాతాళంలో 7 లోకాలు ఉన్నాయంటారు. స్వర్గం, నరకం…ఇలాంటి లోకాలు చూశాం. అయితే పధ్నాలుగు లోకాలకు పైన సత్యలోకం అనేది మరోఒకటి ఉంటుంది. ఈ సత్యలోకం నేపథ్యంతోనే ఈ
సినిమా ఉంటుంది. హీరోయిన్ కోసం హీరో ఈ సత్యలోకానికి ఎలా వెళ్లాడు? అక్కడ ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథనం. అయితే హీరో ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ, సత్యలోకానికి వెళ్లడు. డైరెక్ట్‌గా సత్యలోకానికి వెళ్తాడు. అది ఎలా అనేది సినిమాలో చూడండి. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో హీరో కోసం హీరోయిన్ భూలోకంలోనే
ఉండిపోతుంది. ఇక్కడ హీరో సత్యలోకానికి వెళ్లినప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం” అని పేర్కొన్నారు వశిష్ఠ. అలాగే విశ్వంభర సినిమాలో, విశ్వంభర అనే బుక్ కూడా చాలా కీలకం. ఈ బుక్ వల్లే హీరో సత్యలోకానికి వెళ్లగలుగుతాడని ఫిల్మ్‌నగర్ టాక్.
ఇక విశ్వంభర సినిమాలో త్రిషా క్రిష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్‌కపూర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రావు రమేష్, ప్రవీణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌రెడ్డిలు ఈ సినిమాను నిర్మించారు. వీఎఫ్‌ఎక్స్ పనులు సకాలంలో, క్వాలిటీగా పూర్తి కానుందన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
మరోవైపు ప్రస్తుతం దర్శకుడు అనిల్‌రావిపూడితో సినిమా చేస్తున్నాడు చిరంజీవి. నయనతార, క్యాథరీన్ హీరోయిన్స్. ఈ మూవీలో వెంకటేశ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.