ఎన్టీఆర్‌ సినిమాకు డ్రాగన్‌ టైటిల్‌ ఫిక్స్‌..ఇవిగో ఆధారాలు!

Viswa
2 Min Read
NTRNell Shooting started

Web Stories

‘కేజీఎఫ్‌, సలార్‌’ సినిమాలను తీసిన దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఎన్టీఆర్‌ (NTR)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను ఇంకా అథికారికంగా ప్రక టించలేదు. కానీ చాలా నెలల క్రితం ఈ సినిమాను ఉద్దేశిస్తూ, ఈ సినిమా టైటిల్‌ ‘డ్రాగన్‌’ (Dragon) అంటూ మాట్లాడారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లోని ‘సలార్‌’ సినిమాలో నటించిన ప్రుథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌నీల్‌ (PrashanthNeel) కాంబోలోని సినిమా టైటిల్‌ డ్రాగన్‌ అంటూ మాట్లాడారు. అంతేకాదు..ఈ సినిమాలో మలయాళ నటులు టోవినో థామస్‌, బీజూ మీనన్‌లు నటిస్తున్నట్లు గా కూడా కన్ఫార్మ్‌ చేశారు ప్రుథ్వీరాజ్‌ సుకుమారన్‌. హిందీలో సర్‌జమీన్‌ అనే సినిమా చేశారు సుకుమారన్‌. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ప్రమో షన్స్‌లో భాగంగా సుకుమారన్‌ డ్రాగన్‌ సినిమాను గురించిన, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

NTRNeel Movie Release date
NTRNeel Movie Release date

ఇక ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లోని డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీలో రుక్ష్మీణీ వసంత్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను 2026 జనవరికి విడుదల చేయాలనుకున్నారు. కానీ వీలు పడలేదు. దీంతో 2026 జూన్‌ 25న రిలీజ్‌ చేయబోతున్నారు. రవి బస్రూర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డ్రాగన్‌ టైటిల్‌పై అప్పుడే అనుమానాలు..

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ సినిమా డ్రాగన్‌. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై, సూపర్‌హిట్‌ కొట్టింది. కానీ తెలుగులో ‘డ్రాగన్‌’ పేరుతో కాకుండ, ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌‘ పేరుతో విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీమూవీమేకర్స్‌యే డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఎన్టీఆర్‌- ప్రశాంత్‌నీల్‌ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు కాబట్టే, ప్రదీప్‌ రంగనాథన్‌ ‘డ్రాగన్‌’ సినిమాను ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ పేరుతో విడుదల చేశారని అప్పట్లో ఇండస్ట్రీలో చర్చ సాగింది. ఇప్పుడు అదే నిజమైంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu