రవితేజ (Raviteja) ‘మాస్ జాతర’ (MassJathara) సినిమా స్టార్టింగ్ ముహూర్తం సరిగా లేనట్లుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. తొలుత ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ గత ఏడాది నవంబరు సమయంలో రవితేజకు తీవ్రగాయాలు కావడంతో, ఈ మాస్‌జాతర సినిమా రిలీజ్ సంక్రాంతికి వీలుపడలేదు. ఆ తర్వాత మే9న రిలీజ్ అని అనౌన్స్‌చేశారు. కానీ రవితేజ ఈ తేదీకి రాలేదు. దాంతో ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్‌ను ఆగస్టు 27కి వాయిదా వేశారు. వినాయకచవితి సందర్భంగా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడ ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
జూలై 31న విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాత. ఆగస్టు14న రజనీకాంత్ ‘కూలీ’, ఎన్టీఆర్-హ్రుతిక్ రోషన్‌ల ‘వార్ 2’ సినిమాలు విడుదల అవుతున్నాయి. ‘వార్ 2’ సినిమాను తెలుగులో నాగవంశీ విడుదల చేస్తున్నాడు. మళ్లీ 12 రోజుల గ్యాప్‌లో ‘మాస్ జాతర’ సినిమా అంటే అది కచ్చితంగా రిస్క్ అవుతుంది. పైగా అప్పటికే ‘కింగ్‌డమ్’, ‘వార్ 2, కూలీ’ సినిమాలు థియేటర్స్‌లో ఉండొచ్చు. ఇంకా ఆగస్టు 22న అనుపమాపరమేశ్వరన్ పరదా, నరేశ్ ఆగస్త్య మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఆగస్టు 27న నారా రోహిత్ ‘సుందర కాండ’ రిలీజ్‌ను ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే…రవితేజ మాస్ జాతర సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లేఅనిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక అనౌన్స్‌మెంట్ రావాలి.
మాస్ జాతర సినిమాలో లక్ష్మణ్‌భేరీ అనే పోలీసాఫీసర్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు రవితేజ. శ్రీలీల హీరోయిన్. నవీన్ చంద్ర విలన్ రోల్ చేశాడు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సామజవరగమన, సింగిల్’ సిని మాలకు రైటర్‌గా పని చేసిన భానుభోగవరపు ఈ సినిమాకు డైరెక్టర్. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇంకా రవితేజ మరో లేటెస్ట్ మూవీ ‘అనార్కలి’ (వర్కింగ్ టైటిల్). కిషోర్ తిరుమల ఈ సినిమాకు డైరెక్టర్. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.