‘కూలీ’తో తమిళనాట సూపర్‌హిట్ అందుకున్నాడు రజనీకాంత్. ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ చేయబోయే సినిమాను గురించి, ఇప్పటికే పలు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘బ్రోచెవారెవరురా, సరిపోదా శనివారం’ చిత్రాల ఫేమ్ వివేక్ ఆత్రేయ, హెచ్. వినోద్, వంశీ పైడిపల్లి, ఒకరిద్దరు మలయాళ దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ ఏ దర్శకుడి పేరూ రజనీకాంత్ (Rajinikanth) నెక్ట్స్ సినిమాకూ ఖరారు కాలేదు.
ఇప్పుడు సడన్‌గా ఉన్నట్లుండి మహానటి, కల్కి2898ఏడీ చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్‌కు నాగ్ అశ్విన్ ఓ కథ చెప్పారని, స్టోరీ లైన్ రజనీకాంత్‌కు నచ్చిందని, మరోసారి నరేషన్ వింటానని రజనీకాంత్ చెప్పారని, ఈ స్క్రిప్ట్‌కు నాగ్ అశ్విన్ మెరుగులు దిద్దుతున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇదంతా…తమిళనాడులో ప్రచారంలోకి వచ్చింది.
అంత బాగానే ఉంది…కానీ రజనీకాంత్‌తో నాగ్ అశ్విన్ సోలో ఫిల్మ్ చేస్తున్నారా? లేక ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ సినిమా సీక్వెల్‌లో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారా? అనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఇలానే ఆలియాభట్‌తో నాగ్ అశ్విన్ సినిమా అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తీరా…ఈ ప్రచారంలో నిజం లేదని, నాగ్ అశ్విన్ ‘కల్కి2898ఏడీ’పైనే ద్రుష్టి పెట్టారని తేలింది. ఇప్పుడు ఏ నిజం బటయకు వస్తుందో చూడాలి.
ఒకవేళ ‘కల్కి2898ఏడీ’ సినిమాలో రజనీకాంత్ నటించేందుకు ఒప్పుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే. ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రభాస్, అమితాబ్‌బచ్చన్‌లను చూడటం కంటే…సినిమా లవర్స్ కోరుకునేది ఏముంటుంది?