యువ హీరో, ‘హను-మాన్’ ఫేమ్ తేజా సజ్జా (Tejasajja) కొత్త సినిమా ‘మిరాయ్’ (Mirai) విడుదల వాయిదా పడింది. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తేజ హీరోగా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా సెప్టెంబరు 12న విడుదల కానుంది. తొలుత ఈ సినిమా ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబరు 5న రిలీజ్ చేస్తామని తెఅలాగే ఈ నెల 28న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. తాజాగా వారం రోజులు ఆలస్యంగా సెప్టెంబరు 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ ‘మిరాయ్’ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నాడు. శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరి గౌర మ్యూజిక్ డైరెక్టర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె క్రుతీప్రసాద్ ఈ మిరాయ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సూపర్ యోధ అనే పవర్‌పుల్ పాత్రలో తేజ, బ్లాక్‌స్వార్డ్‌గా మంచు మనోజ్ కనిపిస్తారు.
సెప్టెంబరు 12న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కింధపురి’ చిత్రం కూడా విడుదల అవుతోంది. దుల్కర్‌సల్మాన్ ‘కాంత’ చిత్రం సైతం సెప్టెంబరు 12నే రిలీజ్ డేట్‌గా ప్రకటించింది. కానీ ఈ సినిమా ఈ తేదీకి విడుదల కావడం లేదని, వాయిదా పడిందని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని తెలిసింది.