పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. సెప్టెంబరు 25న దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈ ‘ఓజీ’ సినిమాలోని ‘సువ్వి సువ్వి సువ్వాలా..’ (Suvvi Suvvi Song) పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘సువ్వి సువ్వి సువ్వాలా ..సూదంటూ రాయే పిల్లా….మళ్లీ మళ్లీ కలిసేలా నచ్చావే చాలా చాలా…, సువ్వి సువ్వి సువ్వాలా ..సూదంటూ రాయే పిల్లా….మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇలా…’ అంటూ ఈ ప్రేమ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు తమన్ సారథ్యంలో కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించిన ఈ పాటను, గాయని శృతి రంజని పాడారు.
ఈ చిత్రంలో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్ నటించాడు. సుజిత్ డైరెక్షన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి,
అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మాఫియా సామ్రాజ్యానికి దూరంగా వెళ్లిన ఓ గ్యాంగ్‌స్టర్, తిరిగి పదేళ్ల తర్వాత మళ్లీ ఆ ప్రపంచంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందనే నేపథ్యంతో ఓజీ సినిమా కథనం సాగుతుందట.
ఇక ‘ఓజీ’ సినిమా కాకుండ హరీశ్‌శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.