Vijaydevarakonda in Pushpa3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లోని ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి ‘పుష్ప ది రైజ్’ తర్వాత ‘పుష్ప ది రూల్’ రాబోతోంది. అయితే ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని థర్డ్ పార్టుగా ‘పుష్ప: ది రోర్’ అనే టాక్ వినిపించింది. అయితే ‘పుష్ప’ థర్డ్‌పార్టుగా ‘పుష్ప ది ర్యాంపేజ్’ రానుంది. అయితే ఇందుకు కాస్త సమయం ఉంది.
కానీ ‘పుష్ప3’లో విజయ్‌దేరకొండ యాక్ట్ చేస్తాడన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. కథ ప్రకారం పుష్పరాజ్ ‘పుష్పది రూల్’ క్లైమాక్స్‌లో చనిపోతాడని, పుష్పరాజ్ కొడుకును స్మగ్లింగ్ సిండికేట్‌కి రాకుండ కొందరు అడ్డుకుంటారని, ఈ క్రమంలో పుష్పరాజ్ కొడుకు కూడా, పుష్పరాజ్‌లానే కష్టపడి ఎదుగుతాడని, ఈ ప్రక్రియలో పుష్పరాజ్‌కు ఒకరు ప్రధాన అడ్డంకిగా నిలుస్తారని, ఆ పాత్రనే విజయ్‌దేరకొండ చేస్తున్నారే టాక్ తెరపైకి వచ్చింది.
ఎలాగో విజయ్‌దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది కాబట్టి..‘పుష్ప’ ప్రాంచైజీలోనే విజయ్ దేవరకొండను కూడా ఇన్‌క్లూడ్ చేస్తే బాగుంటుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. పైగా ‘పుష్ప’ సినిమాలో రష్మికామందన్నా, విజయ్‌దేవరకొండలు స్క్రీన్ షేర్ చేసుకుంటారంటే ఆడియన్స్ మరింత ఎగై్జట్ అవుతారు. మరి..‘పుష్ప3’లో విజయ్ దేవరకొండ ఉంటాడా? లేదా? అనేది తెలియడానికి చాలా సమయం ఉంది.
మరోవైపు ప్రస్తుతం విజయ్‌దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాలతో కూడా విజయ్ దేవరకొండ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే.