Sivakarthikeyan Parasakthi: శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ సినిమా వచ్చే పొంగల్‌కి రిలీజ్ కానుంది. జనవరి 14న (Sivakarthikeyan Parasakthi Release) ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై పొంగల్ సంక్రాంతి (Sankrathi2026Movie) అని ఉంది. తమిళనాడులో సంక్రాంతిని పొంగల్‌గా సెలబ్రేట్ చేసు కుంటారు. తెలుగులో సంక్రాంతిగా పండగ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాను తమిళం, తెలుగులో సంక్రాంతి పండక్కే రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.
కానీ తెలుగులో సంక్రాంతి సీజన్ అంటే సినిమాల పరంగా పెద్ద బిజినెస్ సీజన్ కూడా. ఈ సీజన్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి కూడా చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రవితేజ ‘అనా ర్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’, శర్వానంద్ ‘నారి నారి నడుమమురారి’ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అల్లరి నరేశ్ ‘అల్కహాల్’ చిత్రం కూడా జనవరి 1న రిలీజ్ కానుంది. విజయ్ జగనాయకుడు కూడా ఈ సంక్రాంతికి తెలుగులోకి వస్తున్న తమిళ డబ్బింగ్ సినిమా…..ఇన్ని సినిమాలుండగా, శివకార్తీకేయన్ తన ‘పరాశక్తి’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించాడు. తెలుగులోనూ రిలీజ్ చేస్తానంటున్నాడు. మరి..తెలుగు సిని మాలను దాటుకుని శివకార్తీకేయన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా? పరాశక్తి సినిమాకు అంతటి పవర్ ఉందా? తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారు? అన్న డౌట్స్‌పై క్లారిటీ రావలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.
2024లో శివకార్తీకేయన్ ‘ఆలయాన్’ మూవీ తమిళంలో సంక్రాంతికి విడుదలై, తెలుగులో మాత్రం విడుదల కాలేదు. తెలుగు రిలీజ్ చేయానుకున్న ‘దిల్’ రాజుపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. తెలుగులో ఇన్ని సినిమాలు ఉండగా, ఓ తమిళ సినిమాకు థియేటర్స్‌కు కేటాయించాలనే ప్రయత్నాలు ఏమిటి? అన్నది తెలుగు విమర్శకుల మాట. మరి..ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.
ఇక శివకార్తీకేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలోని ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శివకార్తికేయన్ స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడు. జయం రవి తొలి సారిగా విలన్ రోల్ చేస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా కనిపిస్తారు. అథర్వ మరో లీడ్ రోల్‌లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఆనంద భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.