Kantara:Chapter1 Release: తెలుగు సినీ పరిశ్రమలో సోలో రిలీజ్ డేట్ కోసం కొంతమంది హీరోలు, నిర్మాతలు చాలా ఆశపడతారు. కానీ దొరకడం చాలా కష్టం. మొన్నటికి మొన్న ‘కిష్కింధపురి’ సినిమాకు సెప్టెం బరు 12 సోలో రిలీజ్ డేట్ అనుకున్నారు. కానీ సెప్టెంబరు 5న విడుదల కావాల్సిన ‘మిరాయ్’ లాస్ట్ మినిట్‌లో సెప్టెంబరు 12నే రిలీజైంది. ఫలితంగా కలెక్షన్స్ పరంగా ‘కిష్కింధపురి’ సిని మాకు కాస్త డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో.
కానీ కన్నడ సినిమా ‘కాంతార చాఫ్టర్1’కు తెలుగులో ఆల్మోస్ట్ సోలో రిలీజ్ కన్ఫార్మ్ అయిపో యింది. అక్టోబరు2 ‘కాంతార చాఫ్టర్1 (Kantara:Chapter1 Release date )సినిమా రిలీజ్ కానుంది. ఈ తేదీకి తెలుగులో ఓ పెద్ద సినిమా కానీ, మిడ్ రేంజ్ సినిమా కానీ ఏదీ రిలీజ్‌కు లేదు. ముందువారం రిలీజ్ అయ్యే (సెప్టెంబరు 25) పవన్‌కల్యాణ్ ‘ఓజీ (OG)’ సినిమా మాత్రమే ఉంది. ఒకవేళ ‘ఓజీ’ సినిమాకు హిట్ టాక్ వస్తే, అక్టోబరు 2 నాటికీ కొన్ని థియేటర్స్‌లో ‘ఓజీ’ ఉంటుంది. కానీ అప్పటికీ తెలుగు ఆడియన్స్ ‘ఓజీ’ సినిమాను చూసేసి ఉంటారు కనుక, మేజర్ థియేటర్స్ అన్నీ ‘కాంతార: ఛాప్టర్ 1 (Kantara:Chapter1 Release)’ సినిమాకే కేటాయించబడతాయి. పైగా ‘కాంతర’ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణసంస్థలు విడుదల చేస్తున్నాయి. నైజాంలో మైత్రీ మూవీమేకర్స్, ఈస్ట్ వెస్ట్‌లో గీతా ఫిల్మ్స్, గుంటూరులో వారాహి చలనచిత్రం వంటి ఏడు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కలిసి ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఇటు థియేటర్స్ కేటాయింపు పరంగానూ ‘కాంతార’ సినిమాకు డోకా లేదు. అలాగే ‘కాంతర’ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనే టాక్ వినిపిస్తోంది.
ఇక కన్నడ ‘కాంతార చాప్టర్1’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. తెలుగుతో పాటుగా, ఇంగ్లీష్ వంటి అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది. 2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం రూపు దిద్దుకుంటుంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా, గుల్షన్ దేవయ్య మరో లీడ్ రోల్‌లో నటించాడు. శతాబ్దాల క్రితం నాటి సంఘటనలు, వీటికి కొన్ని మైథలాజికల్ అంశాలను జోడింపుతో వస్తున్న కాంతార చాఫ్టర్1 సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు.