Vrusshabha Movie: తండ్రికొడుకుల ఎమోషన్ నేపథ్యంతో రూపొందిన వారియర్ ఫిల్మ్ ‘వృషభ’ (Vrusshabha Movie). ఈ చిత్రంలో మోహన్‌లాల్ తండ్రి పాత్రలో నటించగా, కన్నడ యువ నటుడు సమర్జిత్ కొడుకు పాత్రలో నటించాడు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ ఈ సినిమాను నిర్మిస్తుండా, నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వృషభ చిత్రం దీపావళి (Vrushabha Movie Release date) కి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ (Vrushabha Teaser)ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ప్రామిసింగ్‌గానే ఉంది.వృషభ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది.
కానీ వృషభ సినిమాలోని మోహన్‌లాల్ పాత్రకు తొలుత శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక అనుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. ఏమైందో ఎమో కానీ రోషన్ ప్లేస్‌ను సమర్జిత్ (Samarjit Lankesh) రీ ప్లేస్ చేశాడు.
TELUGU ACTOR ROSHANN MEKA TO PORTRAY MOHANLAL’S SON IN PAN-INDIA FILM ‘VRUSHABHA’… #RoshannMeka – who has acted in several #Telugu films – will essay the part of #Mohanlal’s son in #Vrushabha.
Directed by #NandaKishore, the film – an epic action-entertainer transcending… pic.twitter.com/WEEjf2JKwR
— taran adarsh (@taran_adarsh) July 13, 2023
కారణాలు ఏమైనా, మోహన్‌లాల్‌తో యాక్ట్ చేసే ఓ మంచి చాన్స్‌ను రోషన్ మిస్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ వృషభ చిత్రంలో రోషన్ నటించి ఉంటే, ఇతర భాషల్లోనూ యాక్టర్‌గా పరిచయం అయ్యేవాడు. ఇది రోషన్ కెరీర్‌కు కచ్చితంగా ఫ్లస్ అయ్యేది. కానీ అలా జరగలేదు.
మరోవైపు ఓ ప్రీ ఇండిపెండెన్స్ ఏరాలో సాగే ‘చాంపియన్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో రోషన్ హీరోగా చేస్తున్నాడు. అనశ్వర హీరోయిన్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.