Pawankalyan OG Release: పవన్‌కల్యాణ్ గత చిత్రం ‘హరిహరవీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన రెండు నెలలకు, ‘ఓజీ’ (OG) సినిమాతో థియేటర్స్‌కు వస్తున్నాడు పవన్‌కల్యాణ్ (Pawankalyan). కానీ ‘ఓజీ’పై ‘హరిహర వీర మల్లు’ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఇసుమంతైనా కనిపించడం లేదు. ‘ఓజీ’ సినిమా టికెట్ రేట్స్ వీపరీతంగా సేల్ అయిపోతున్నాయి. పవన్ క్రేజ్, చరిష్మాలకు ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా క్రేజ్, హైప్ తోడుగా, దసరా సెలవులు, టికెట్ ధరల పెంపు (Pawankalyan OG Ticket Rates) , సోలో రిలీజ్, ప్రీమియర్స్…ఇలా అన్నీ కుదిరాయి. ఇప్పుడు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు కావాల్సిందల్లా ..‘ఓజీ’ సినిమాపై హోప్. పవన్‌కల్యాణ్, దర్శకుడు సుజిత్ సినిమా బాగుందన్న హోప్‌ను ఆడియన్స్‌కు ఇస్తే, చాలు ప్రస్తుతం ‘ఓజీ’ సినిమాపై ఉన్న హైప్ డబుల్ అవు తుంది. పవన్ కెరీర్‌లోనే హాయ్యెస్ట్ గ్రాసర్, కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘ఓజీ’ నిలుస్తుంది. ఇప్పటివరకు ‘ఓజీ’ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్..ఇలా ఏ కంటెంట్ అయినా ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరచలేదు. ‘ఓజీ’ సినిమా కూడా ఆడియన్స్‌ను నిరుత్సాహ పరచదనే పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇడ్లీలు వేయడానికే పుట్టాననిపిస్తోంది…!.. ఇడ్లీ కొట్టు ట్రైలర్ విడుదల
పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే హాయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న విడుదల కా నుంది. సుజిత్ డైరెక్టర్. ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరో యిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మి, అర్జున్‌దాస్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓజాస్ గంబీర ఆలియాస్ ఓజీ పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా, ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. కణ్మనిగా ప్రియాంక కనిపిస్తారు. 1980 – 1990 నేపథ్యంతో ముంబై బ్యాక్‌డ్రాప్‌తో సాగే చిత్రం ‘ఓజీ’ (OGMovieStory). ఈ సినిమా ప్రధానంగా, డాటర్ సెంటి మెంట్‌తో సాగుతుందని తెలుస్తోంది (OG Review). తన కుమార్తె కోసమే, ఓజీ తిరగి మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.