KatrinaKaif pregnancy: బాలీవుడ్ స్టార్ కపుల్స్ విక్కీ కౌశల్ (Hero VickyKaushal), కత్రినాకైఫ్ (KatrinaKaif ) లు శుభవార్త చెప్పారు. తాము పేరెంట్స్ కాబో తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ‘‘మా జీవితాల్లో అందమైన అధ్యాయం మొదలు కాబోతుంది. మా హృదయం సంతోషంతో నిండిపోయింది’’ అని ఇన్ స్టా వేదికగా విక్కీ కౌశల్, కత్రినాకైఫ్‌లు వెల్లడించారు. విక్కీ–కత్రినాలు ఈ శుభవార్తను సోషల్‌మీడియాలో షేర్ చేయగానే, వీరిద్దరి అభిమానులు, బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
ఇక రీసెంట్‌గా కత్రినా కైప్ తల్లి కాబోతున్న విషయం గురించి, విక్కీ కౌశల్‌ను బాలీవుడ్ మీడియా అడిగినప్పుడు అలాంటిదీ ఏమీ లేదన్నట్లుగా చెప్పాడు. ఆ తర్వాత కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఓ ఫోటో షూట్ ఉన్న ఫోటోలు సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. దీంతో విక్కీ–కత్రినాలు ఫైనల్‌గా తమ శుభవార్తను అధికారికంగా ప్రకటించారు. ఇక 2021లో విక్కీ కౌశల్– కత్రినా కైఫ్‌లు వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.