జైలర్‌ 2 రిలీజ్‌ డేట్‌ కన్ఫార్మ్‌ చేసిన రజనీకాంత్‌

Viswa
Jailer2 Movie Release date

Web Stories

Jailer2 Release: రజనీకాంత్‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘జైలర్‌ 2’ (Jailer2). రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నటించి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్‌’ సినిమాకు సీక్వెల్‌ ‘జైలర్‌ 2 (Jailer2 Release date)’. ‘జైలర్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన, నెల్సన్‌ దిలీప్‌ కుమా ర్‌నే ‘జైలర్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోం ది. కాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫార్మ్‌ చేశారు రజనీకాంత్‌ (Rajinikanth).

కేరళలోని పాలక్కడ్‌ లోకేషన్స్‌లో ఇటీవల ‘జైలర్‌ 2’ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారం భమైంది. ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, రజనీకాంత్‌ చెన్నైకి రాగా, అక్కడ విలేకర్లు ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ను గురించి అడిగారు. అప్పుడు ‘జైలర్‌ 2’ సినిమాను జూన్‌ 12న (Jailer2 Release date ) రిలీజ్‌ చేస్తున్నట్లుగా తెలిపారు రజనీకాంత్‌.

ఇక ‘జైలర్‌’ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, మీర్నా మీనన్, శివరాజ్‌కుమార్‌లు ‘జైలర్‌ 2’ (Jailer Sequel) సినిమాలోనూ నటించారు. కొత్తగా బాలకృష్ణ ఈ ‘జైలర్‌ 2’ చిత్రంలో ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారని తెలిసింది. అనిరు«ద్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇక ‘జైలర్‌ 2’ చిత్రం తర్వాత కమల్‌హాసన్‌ రాజ్‌కమల్‌ఫిలింస్‌ ఇంటర్‌నేషన్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా (RajinikanthNext film)  నటిస్తారు. అయితే ఈ చిత్రం లో రజనీకాంత్‌తో పాటుగా, కమల్‌హాసన్‌ కూడా నటిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా దర్శకుడు కూడా ఫైనలైజ్‌ కావాల్సి ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos