Akhanda 2 Release date: బాలకృష్ణ (Balakrishna) లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ (Akhanda 2) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘అఖండ 2’ సినిమా ఈ డిసెంబరు 5న (Akhanda 2 Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తొలుత ‘అఖండ 2’ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 25 నుంచి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశామని అప్పట్లో చిత్రంయూనిట్ పేర్కొంది.
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (BoyapatiSrinu) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గానే ‘అఖండ2: తాండవం’ అనే సినిమా వస్తుంది. గోపీ ఆచంట, రామ్ ఆచంటలతో పాటుగా, ఈ సినిమాకు బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి ఓ నిర్మాత కావడం విశేషం. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ సంయుక్త, హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో బాలకృష్ణతో పాటుగా, 600మంది డ్యాన్సర్లు పాల్గొనగా, గ్రాండ్‌గా ఓ సాంగ్‌ను షూట్ చేశారు మేకర్స్.
ఇక నాలుగు సంవత్సరాల క్రితం కోవిడ్ సమయంలో 2021లో డిసెంబరు 2వ తారీఖున ఈ ‘అఖండ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘అఖండ 2’ చిత్రం కూడా డిసెంబరు తొలివారంలోనే రిలీజ్ అవుతుండటం విశేషం. ఇక డిసెంబరు 5న విడుదల కావాల్సిన ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రం సంక్రాంతికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.