JrNTR KantaraChapter1: కన్నడ ప్రముఖ నటుడు రిషబ్‌శెట్టి, ఎన్టీఆర్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. గత ఏడాది ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్లి, అక్కడ ఓ దేవాలయాన్ని సందర్శించుకున్నప్పుడు, రిషబ్‌శెట్టి, ప్రశాంత్ నీల్‌లు కూడా వెళ్లారు. ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్, రిషబ్‌శెట్టిలు వారి వారి ఫ్యామిలీలతో వెళ్లారు. వీరి మధ్య అంతటి మంచి అనుబంధం ఉంది.
ఇక రిషబ్‌శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార:ఛాప్టర్ 1’ సినిమా అక్టోబరు 2న విడు దల కానుంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు అతిథిగా హాజరవుతున్నారు ఎన్టీఆర్. ‘కాంతార చాప్టర్1’ సినిమాను గురించి, ఎన్టీ ఆర్ ఎలాగూ మాట్లాడతారు. కానీ తన గత చిత్రం ‘వార్ 2’ బాక్సాఫీస్ రిజల్ట్‌పై ఏమైనా మా ట్లాడతారా? అనే సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే ఇటీవల అనంతపురంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలపై స్పందిస్తారా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.
ఇక ప్రజెంట్ ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇక ఇటీవల ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా ఎన్టీఆర్ గాయ పడ్డారు. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి, డ్రాగన్ సినిమా షూటింగ్‌లో పాల్గొం టారు ఎన్టీఆర్.