please subscribe to Tollywoodhub YouTube channel

థియేటర్స్ లో సినిమాగా రాబోతున్న ‘మీర్జాపూర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

Kumar NA
1 Min Read

Web Stories

Mirzapur: డిజిటల్ స్క్రీన్ పై సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ క్రేజీ సిరీస్‌ను ఇప్పుడు ‘మీర్జాపూర్: ద ఫిల్మ్’ పేరుతో భారీ ఎత్తున సినిమాగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఓటీటీకే పరిమితమైన మీర్జాపూర్ రా అండ్ రస్టిక్ లోకాన్ని, ఇప్పుడు థియేటర్లలో లార్జర్ దన్ లైఫ్ అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. వెబ్ సిరీస్‌లో అందరినీ ఆకట్టుకున్న మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) పాత్ర మళ్లీ ఈ సినిమా ద్వారా తిరిగి వస్తుండటం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్. ఆయనతో పాటు పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు పండిట్) తమ ఐకానిక్ పాత్రల్లో అలరించబోతున్నారు.

ఎక్సెల్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్ స్థాయిని మించి యాక్షన్, డైలాగ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. ‘మీర్జాపూర్’ లాంటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సిరీస్ సినిమాగా రావడం ఇదే మొదటిసారి. 2026 సెప్టెంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుండటంతో, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెబ్ సిరీస్ చూడని వారు కూడా అర్థం చేసుకునేలా, అదే సమయంలో పాత అభిమానులను అలరించేలా ఈ కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు పునీత్ కృష్ణ తెలిపారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi