ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా చేస్తున్న హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’ (The Raja Saab Trailer ). మారుతి డైరెక్షన్‌లోని ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌లు నిర్మాతలు. ఈ సినిమా నిడివి మూడుగంటలకుపైనే ఉంటుంది. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స కానీ ఆ తరవాత డిసెంబరు 5కి వాయిదా వేశారు. ఇటీవల వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 9న (TheRajasaabRelease date) రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. అయితే ప్రమోషన్స్ విషయంలో ‘రాధేశ్యామ్’ సినిమా స్టైల్‌ను ‘ది రాజాసాబ్’ సినిమా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు రెండు ట్రైలర్స్‌ను రిలీజ్ చేశారు. 2022 మార్చిలో ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలైంది. కాగా, 2021 డిసెంబరు 23న ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మళ్లీ రిలీజ్‌కు ముందు అంటే…మార్చి 2న ‘రాధేశ్యామ్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఇప్పుడు ‘ది రాజాసాబ్’ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ సినిమా తొలి ట్రైలర్‌ను (TheRajasaab Trailer) ఈ రేపు సాయంత్రం (సెప్టెంబరు 28) రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఇదే ఫైనల్ ట్రైలర్ కాదు… సినిమా జనవరి 9న రిలీజ్ కనుక, ఆ సమయంలో మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ‘ది రాజాసాబ్’ సినిమా చిత్రీకరణ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతోంది. రిలీజ్ సమయంలో…ఈ సినిమాను ఆడియన్స్‌కు చేరువ చేయాలని మేకర్స్ ఇలా రెండు ట్రైలర్స్‌ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక ‘ది రాజాసాబ్’ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌లు హీరో యిన్స్‌గా నటించగా, సంజయ్‌దత్, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, సప్తగిరిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.