రవితేజ కొడుకు మహాధన్ దర్శకుడిగా కెరీర్‌ను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో, చిన్నప్పటి రవితేజ క్యారెక్టర్ చేశాడు మహాధన్. కానీ ఆ తర్వాత మహాధన్ యాక్టర్‌గా మరో మూవీ రాలేదు. అప్పుడప్పుడు మహాధన్ యాక్టర్ కాబోతున్నాడన్న వార్తలు మాత్రం వినిపించాయి. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి దగ్గర మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు.
రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతార’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, మహాధన్ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న విషయాని బహిర్గతం చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇందులో సూర్య హీరోగా చేస్తున్నాడు. మరి..సినిమా క్రాప్ట్సపై అవగాహన పెంచుకునేందుకు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడా? లేక నిజంగానే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
‘సార్, లక్కీభాస్కర్’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ దర్శకుడి తాజా సినిమాలో సూర్య హీరోగా చేస్తున్నాడు. సూర్య కెరీర్‌లోని ఈ 46వ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇటీవలే యూరప్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు మేకర్స్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.