Spirit: హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌తో రానున్న సినిమా ‘స్పిరిట్ (Spirit)’. ఈ పాటికే, ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సమయం ఆసన్నమైంది.ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తారు. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. తరుణ్, శ్రీకాంత్, దక్షిణ కొరియా నటుడు డాన్లీలు ఈ సినిమాలో భాగమౌతారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలైయ్యేలా, సందీప్‌రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ ప్రధానంగా ముంబై నేపథ్యంతో సాగుతుందట. అందుకే ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను ముందుగా, ముంబైలో మొదలుపెట్టి, ఆ తర్వాత మెక్సికో, ఇండోనేషియా, యూకే లొకేషన్స్‌లో చిత్రీకరిచాలని సందీప్‌రెడ్డి వంగా అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే…‘స్పిరిట్’ సినిమా కూడా ఫ్రాంచైజీ మూవీనే అట. ఆల్రెడీ ‘సలార్, రాజాసాబ్’ ఫ్రాంచైజీ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండబోతున్న ఈ తరు ణంలో, ఈ పాన్ ఇండియా హీరో నుంచి మరో ఫ్రాంచైజీ అనేది కూసింత ఆశ్చర్యకరమైన విషయమే. మరి…‘స్పిరిట్’ సినిమా హిటై్టతే, ‘స్పిరిట్ 2’ ఉంటుంది. లేకపోతే లేదు. ఈ ఫ్రాంచైజీ బిల్డ్ అయ్యే బాధ్యత అంతా ఇప్పుడు సందీప్‌రెడ్డివంగాపైనే ఉంది.
మరోవైపు ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ప్రభాస్ చేస్తున్న మరో సినిమా ‘ఫౌజి’ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.