Ramcharan and Upasana going to parents one more time: రామ్‌చరణ్– ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేసి, ఉపాసన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
గడిచిన దీపావళి పండగ వేడుకలు చిరంజీవి ఇంట్లో ఘనంగా జరిగాయి. వెంకటేశ్, నాగార్జున, రానా, విఘ్నేష్‌శివన్ (నయనతార భర్త), వరుణ్‌తేజ్ వంటి చాలామంది ప్రముఖులు ఈ దీపా వళి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ దీపావళి వేడుకలతో పాటుగా, మరోసారి తల్లి కాబో తున్న ఉపాసానను ఆశ్వీర్వదించే కార్యక్రమం కూడా సంప్రదాయంగా జరిగింది. ఈ హ్యాపీ వీడియోనే ఉపాసన సోషల్‌మీడియోలో షేర్ చేయగా, ఆ వీడియోలో వైరల్ అవుతోంది. అలాగే రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్న తరుణంలో మెగా అభిమానులు అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
View this post on Instagram
ఇక 2012లో రామ్‌చరణ్–ఉపాసన పెళ్లి చేసుకున్నారు. 2023 జూన్‌లో ఉపాసన.. క్లీకారకు జన్మనిచ్చారు.తాజాగా మరో శుభవార్తను చెప్పారు. ఇక ఉపాసన ట్విన్స్‌కు (కవల పిల్లలకు) జన్మనివ్వబోతుండటం విశేషం.