Raju weds Rambai Success Meet: అఖిల్, తేజస్వి జంటగా యాక్ట్ చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju weds Rambai Success Meet) సినిమా ఈ నెల 21న థియే టర్స్‌లో విడుదలై, సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతుంది. కలెక్షన్స్ పరంగా ఈ చిన్న ఇప్పటికే దాదాపు రూ. 10 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన వేణు ఊడుగుల కీలక వ్యాఖ్యలు చేశారు.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రివ్యూ (Raju weds Rambai Preview) (రిలీజ్‌కు ముందే సినిమాను కొంతమందికి చూపించడం)కి మేం కొంతమందిని పిలిచాము. కొందరు వచ్చారు. మరికొందరు మేం పిలవకపోయినా వచ్చారు. సరే..వచ్చారు కదా అని అనుకున్నాం. కానీ వారిలో ఇంకొందరు ఇంట్రవెల్ తర్వాత వెంటనే, దొంగల్లా వెళ్లిపోయారు. ఒక ఫిల్మ్ మేకర్ కి ఇంత కన్న అవమానం ఉండదు. అలా వెళ్లినవారు సైలెంట్‌గా ఉండకుండ, సినిమా బాగోలేదని, దర్శకుడికి అస్సలు సినిమా తీయడమే రాదని, ఈ సినిమా ఒక్క షో కూడా ఆడదని నెగటివ్ ప్రచారం చేశారు. కానీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను ప్రేక్షకులు వారి గుండెల్లో పెట్టుకుని ఆదరించారు. సినిమా ప్రివ్యూ మధ్యలో వెళ్లిపోయిన వారికి చెబుతున్నాను. దయచేసి మీరు సినిమా ప్రివ్యూలకు రావొద్దు. వచ్చినా అలా మధ్యలో వెళ్లి పోవద్దు. వెళ్లిపోతు న్నందుకు బాధగా లేదు. కనీసం సినిమా సాంస్కృతిక సంస్కృతికి గౌరవం ఇవ్వాలి కదా!’’ అని కాస్త భావోద్వేగంతో మాట్లాడారు వేణు ఊడుగుల. ఇప్పుడు ఈ మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైయ్యాయి.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను వేణు ఊడుగులు, రాహుల్ మోపిదేవి నిర్మించగా, నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో చైతన్య జొన్నలగడ్డ ఓ కీలక పాత్రలో నటించాడు. కొన్ని వాస్తవ సంఘటలన ఆధారంగా ఈ సినిమాను తీశారు దర్శకుడు సాయిలు.
Ê mấy ông iOS user, nghe nói có link tải 88vin ngon nghẻ cho iPhone nè. Test thử xem sao nha! Find it here: tai 88vin.link ios
Dailyjili2 – if you are gonna play jili games, what is bad to come visit the website every day. You just hit the jili jackpot on the go!dailyjili2