Spirit Movie Started: ప్రభాస్ (Spirit Movie Hero Prabhas) హీరోగా సందీప్‌రెడ్డి వంగా (Spirit Director SandeepReddyVanga) డైరెక్షన్‌లో తెరకెక్కాల్సిన ‘స్పిరిట్’ (Spirit Movie Shooting) సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు ఈ ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ పూజా కార్యక్రమంలో ఈ ‘స్పిరిట్’ చిత్రం హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి దిమ్రీ, నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డివంగా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ లతో పాటుగా, ఇతర టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలతో స్పిరిట్ సినిమా చిత్రీ కరణ ఆదివారం ప్రారంభమైనట్లుగా చిత్రంయూనిట్ వెల్లడించింది.
అయితే ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాస్ లుక్ మాత్రం బయటకు రాలేదు. ప్రభాస్ లుక్, గెటప్ రివీల్ కాకూడదనే ‘స్పిరిట్’ టీమ్ ఇలా చేసి ఉంటారని ఊహించవచ్చు. ‘‘ప్రభాస్ అన్న హ్యాండ్స్ చాలు…’ అన్నట్లు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. సో.. కావాలనే ‘స్పిరిట్’ టీమ్ ప్రభాస్ లుక్స్‌ను హైడ్ చేసినట్లుగా స్పష్టం అవుతోంది.
దాదాపు మూడు సంవత్సరాల క్రితం ‘స్పిరిట్’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ నవంబరు 23, 2025న ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ లోపు ఈ ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కంప్లీట్ చేశారు సందీప్‌రెడ్డి వంగా. దీంతో ‘స్పిరిట్’ (Spirit Movie Release date) సినిమా చిత్రీకరణ త్వరిత గతినే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ ‘స్పిరిట్’ చిత్రం కోసం హీరో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తు న్నాడు. ఓ డాక్టర్ పాత్రలో త్రిప్తి దిమ్రి కనిపిస్తారని తెలిసింది. అంతేకాదు..ఈ సిని మాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయి. ఇందులో ప్రభాస్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచనలు ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ‘స్పిరిట్’ సినిమా 2027లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్, ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ది రాజాసాబ్’ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. ఫౌజీ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రాలే కాకుండ హోంబలే ఫిలింస్ సంస్థలో మూడు సినిమాలు కమిటైయ్యాడు ప్రభాస్. ఇంకా నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ‘కల్కి 2’ సినిమా కూడా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.