TheRajasaab Rebel saab Song: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫ్యాంటసీ యాక్షన్ అండ్ హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ (TheRajasaab Movie). ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ది కుమార్, నిధీ అగర్వాల్‌లు హీరోయిన్స్‌గా నటించారు. సంజయ్‌దత్ ఓ మెయిన్ లీడ్ రోల్ చేయగా, సప్తగిరి, వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్..వంటి వారు ఈ ‘ది రాజాసాబ్’ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. మారుతి (The Rajasaab Movie Director Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సం క్రాంతి సందర్భంగా జనవరి 9న (TheRajasaab Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తాత–మనవడి ఎమోషన్ నేపథ్యంతో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో తాతగా సంజయ్‌దత్, మనవడిగా ప్రభాస్ కనిపిస్తారు. దెయ్యంగా ఉన్న తాత, మనవడిని అవహాస్తే ఏం జరుగుతుంది? తాత వారసత్వ ఆస్తి కోసం మనవడు ఏం చేశాడు? అన్న అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో ‘ది రాజాసాబ్’ సినిమా కథనం సాగుతుందని తెలిసింది (The Rajasaab Story).
రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మరింత ప్రమోషనల్ కంటెంట్‌ను ఆడియన్స్‌కు చేరువ చేయాలని, ఈ చిత్రం మేకర్స్ తాజాగా ‘రెబల్ సాంగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని ఆది వారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఈ చిత్రం దర్శకుడు మారుతితో పాటుగా, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ తది తరులు పాల్గొన్నారు. ఇక ఈవెంట్‌లో రిలీజైన ‘రెబల్ సాంగ్’ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ ఇచ్చేలా ఉంది.
‘రొమాంటిక్ రెబల్స్…’, ‘బ్యాంగరు..బ్యాంగరు…’ అంటూ ప్రభాస్ కటౌట్‌కు తగ్గ మాస్ లిరిక్స్‌ను అందించారు ఈ పాట రచయిత రామజోగయ్యశాస్త్రి.
‘‘సింగారే సింగ సింగ…సింగులుగున్నారో…భార్య బంగారం లేక బోరైతున్నాగా….యాడుందో నాక్కోబే పిల్లా హ్యాపీగా…ఏ వేళకి వడియాలు పెడుతుందో తాపీగా….’’
‘‘పాన్ ఇండియా నంబరు వన్…పాన్ ఇండియా నంబరు వన్…బ్యాచిలర్ నేనేలే…’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఈ ‘రెబల్ సాంగ్’లోని లిరిక్స్ సాగుతాయి. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.