Dacoit Telugu Trailer: అడివి శేష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘డెకాయిట్’ (Adivi Sesh Dacoit Movie). మృణాల్ ఠాకూర్ హీరోయిన్. అనురాగ్ కశ్యప్, మైరాఖాన్‌లు ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో, ఈ సినిమాతో దర్శ కుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీలో రూపొందింది. ఈ రెండు భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ (Dacoit Telugu Trailer) చేశారు.
‘హరి పెళ్లి చేసుకుందామా…?, నువ్వు..నేను..ఓ బుడ్డొడు…’
‘బుడ్డది…చిన్న జూలీయట్ కావాలి కదా..’
‘హే..జూలియట్ అబద్ధం చెప్పకు….అబద్ధం చెప్పకు…నిజం చెప్పు…’
‘నాలైఫ్ నాకు మళ్లీ కావాలి…ఫిక్స్’
‘డ్రైవర్ నువ్వు..దొంగ నేను…’
‘హరి..నువ్వు ఉంటావ్ కదా…,హా..హా..నేను ఉండాలి కదా..’
అన్న డైలాగ్స్…ఈ సినిమా తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి…
హరి (అడివి శేష్), సరస్వతి (మృణాల్‌ఠాకూర్) ప్రేమించుకుంటారు. పెళ్లి కూడ చేసుకోవాలనుకుంటారు. కానీ సరస్వతి కారణంగా, హరి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సరస్వతికి మరోకరితో పెళ్లి జరుగుతుంది. ఆమెకు ఓ బేబీ. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా…హరి, సరస్వతిలు.. కలిసి మళ్లీ ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది. విడిపోయిన మాజీ ప్రేమికులు మళ్లీ క్రైమ్ చేయాల్సినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా మెయిన్ కథాంశంగా తెలుస్తోంది. అనురాగ్ కశ్యప్, మైరాఖాన్‌లు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ప్యూర్ లవ్‌స్టోరీ మూవీగా డెకాయిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది.