అక్కినేని యువ వారసుడు అక్కినేని అఖిల్ (Akhil Lenin) లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ (Lenin Movie Release). ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. సినిమా మొదలై, 30శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత, ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ లవ్‌స్టోరీ మూవీ ‘లెనిన్’. అయితే ఈ లెనిన్ మూవీ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ‘లెనిన్’ సినిమాను తొలుత దీపావళికి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ…షూటింగ్ కాస్త నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో…లెనిన్ సినిమాను నవంబరులో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి..అనుకున్నట్లుగానే లెనిన్ మూవీ నవంబరులో విడుదల అవు తుందా? అఖిల్ కెరీర్‌కు మంచిబూస్ట్ ఇస్తుందా? అనేది చూడాలి. ‘లెనిన్’ సినిమాను నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.
Lenin Movie Release: లెనిన్ రాక అప్పుడేనా!

2 Comments
-
Pingback: Akkineni Nagarjuna in AkhilLenin: అఖిల్ సినిమాలో నాగార్జున?
-
Pingback: Heroine Sreeleela: మరో తెలుగు సినిమా నుంచి శ్రీలీల అవుట్?