Venkatesh movie title: వెంకటేష్‌ ఆనంద రామయ్య!

Viswa
1 Min Read
Hero Venkatesh

Web Stories

త్రివిక్రమ్‌ సినిమా టైటిల్స్‌లో మేజర్‌ సినిమాల్నీ..‘అ’ అక్షరంతోనే మొదలవుతాయి. ఈ ‘అ’ సెంటిమెంట్‌తో త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల..వైకుంఠపురములో..’, ‘అతడు’ ‘అ..ఆ’ వంటి సినిమాలు విజయాలు సాధించగా, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. అయితే త్రివిక్రమ్‌ మరోసారి తన ‘అ’ సెంటిమెంట్‌తో రానున్నారట.

హీరో వెంకటేష్(Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram)కాంబినేషన్‌లో ఓ మూవీ రానుందనే ప్రచారం జరుగుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ఆనంద రామయ్య’ (anandharamaiah)అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్‌. అలాగే..‘కుటుంబరావు’ అనే మరో టైటిల్‌ను పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్‌.. ఈ టైటిల్స్‌ని బట్టి చూస్తుంటే….వెంకటేష్‌తో త్రివిక్రమ్‌ తీయబోయేది…పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ అని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్‌ రైటర్‌గా పని చేసి, వెంకటేష్‌ హీరోగా చేసిన ‘నవ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి సినిమాలు ఎంత భారీ హిట్స్‌గా నిలిచాయో తెలిసిందే.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi