‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్ కావడంతో అఖిల్ బాగా నిరుత్సాహపడ్డాడు. దీంతో తన నెక్ట్స్ మూవీ (Akhil Next Film Release) కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఫైనల్‌గా కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా తీసిన,మురళీకృష్ణ అబ్బూరి డైరెక్షన్‌లో ఓ రూరల్ డ్రామా ఈ సినిమాకు కమిటైయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంద. శ్రీలీల హీరోయిన్ అని తెలిసింది.
టైటిల్ లెనిన్
లెనిన్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ ప్రారంభమైందని తెలిసింది. రాయలసీమ నేపథ్యంతో, చిత్తూరులోని ఓ విలేజ్‌లో జరిగే డ్రామాగా ఈ మూవీ ఉంటుంది. ఈ యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రీకరణ ఈ ఇపాటికే సంగం పూర్తి అయ్యేది. కానీ…మధ్యలో సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్)తో అఖిల్‌టైమ్ స్పెండ్ చేశారు. దీంతో షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. కాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 14 నుంచి హైద రాబాద్‌లో ప్రారంభం అవుతుందని తెలిసింది. దాదాపు 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో, మూవీ చిత్రీకరణ యాభైశాతం పూర్తవుతుందని తెలిసింది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే…ఈ మూవీని దసరా సమయంలో రిలీజ్ చేయాలన్నది టీమ్ ప్లాన్ అని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు విని పిస్తున్నాయి.
దసరాకు గట్టిపోటీ
కానీ దసరాకు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఉంది. బాలకృష్ణ ‘అఖండ 2’, సాయిదుర్గాతేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, రిషబ్‌శెట్టి ‘కాంతార 2’ చిత్రాలు రిలీ జ్‌కు ఆల్రెడీ కర్ఛీప్ వేశాయి. ఈ మూడు చిత్రాల్లో…ఏ మూవీ అయిన…రిలీజ్‌ను వాయిదా వేసుకుంటే…అఖిల్ సినిమా దసరాకు రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. లేకపోతే…ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుంది.
అఖిల్ మరో మూవీపై త్వరలో క్లారిటీ!
‘సలార్, కేజీఎఫ్’ సినిమాలు తీసిన ప్రశాంత్‌నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అనిల్, ఓ మైథ లాజికల్ కథను అఖిల్‌తో చేయాలని ట్రై చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. హోంబలే ఫిలింస్ కూడా జాయిన్ అయితే అవ్వొచ్చు. నిజానికి…ఏజెంట్ తర్వాత అఖిల్ స్టార్ట్ చేయాల్సిన సినిమా ఇదే. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం పడుతుండటంతో, అఖిల్ ….కిరణ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే అనిల్‌తో అఖిల్ చేసే మూవీపై అతి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.