హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) వరుస హారర్ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. సాయిథరమ్‌తేజ్‌తో ‘విరూపాక్ష’వంటి హారర్ మూవీ తీసిన కార్తీక్ దండుతో నాగచైతన్య ఆల్రెడీ ఓ హారర్ మూవీకి కమిటైయ్యారు. ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ఆరంభం కానుంది. ఇంకా మూవీ సెట్స్‌పైకి వెళ్లకుండానే మరో హారర్ మూవీకి నాగచైతన్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి వంటి హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ తీసిన ఆర్కా మీడియా ఓ హారర్ మూవీని తీయబోతున్నారు. ఈ సినిమాలోనే నాగచైతన్య హీరోగా నటించను న్నారని, ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
Ramcharan Gamechanger: బ్రేక్ ఈవెన్‌కి గేమ్‌చేంజర్ ఎంత కలెక్ట్ చేయాలి?
కెరీర్ మొదట్లో హారర్ సినిమాలకు నాగచైతన్య కాస్త దూరంగా ఉండేవారు. హారర్ సినిమాలను చూసేం దుకు కూడా ఇష్టపడేవారు కాదు. అయితే అమెజాన్ ప్రైమ్ కోసం నాగచైతన్య ‘ధూత’ అనే ఓ సూపర్ నేచులర్ హారర్ సిరీస్ చేశారు. మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. నాగచైతన్య యాక్టింగ్‌ను కూడా మెచ్చుకున్నారు. అప్పట్నుంచి హారర్ సినిమాలు చేయాలని నాగచైతన్య ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవిలు హీరో హీరోయిన్లుగా నటించిన ‘తండేల్’ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. చందూమొండేటి ఈ సినిమాకు దర్శకుడు.