రణ్‌బీర్‌కపూర్‌ రామాయణ..అంతా సిద్ధం

Viswa

బాలీవుడ్‌లో దర్శకుడు నితీష్‌ తివారి (Nithis Tiwari) డైరెక్షన్‌లో రామాయణం ఇతీహాసం ఆధారంగా ‘రామాయణ’ మూవీ (Ramayana Movie) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నమిత్‌ మల్హోత్రా (RamayanaProducer NamitMalhotra) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న యశ్‌ (Producer Yash) ఈ సినిమాకు మరో నిర్మాత. కాగా హిందీ రామాయణం సినిమాలోని నటీనటుల గురించి ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుందని, తొలిభాగం రామాయణ-పార్టు 1 వచ్చే ఏడాది దీపావళికి (RamayanaPart1), రామాయణ పార్టు 2 (Ramayana part2) 2027 దీపావళికి విడుదల అవుతున్నా సమాచారం మాత్రమే అధి కారికంగా ఉంది. సినిమా స్టార్ట్‌ చేసిన మూడు సంవత్సరాలపైనే అవుతోంది. ఈ రిలీజ్‌ సమాచారం తప్ప, ఈ సినిమాను గురించిన మరో అప్‌డేట్‌ రాలేదు.

ఈ ఏడాది జరిగిన వేవ్స్‌ సమ్మిట్‌లో ‘రామాయణ’ సినిమాను పూర్తిస్థాయిలో ఓ వీడియో ద్వారా ప్రకటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు. అయితే ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ‘రామాయణ’ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ వీడియోను జూలై 3న మేకర్స్‌ రిలీజ్‌ చేయాలని భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాలోని ప్రముఖ నగరాల్లోని థియేటర్స్‌లో ‘రామాయణ’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియో ప్రదర్శితం కానుందట.

ఈ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్‌ (Ranbirkapoor), సీతగా సాయిపల్లవి (Saipallavi), లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌, రావణుడిగా యశ్‌, శూర్పణకగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు..వంటి వారు నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కానీ ఈ వివరాలపై అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో ఈ రామాయణ సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో ఈ వివరాలు ఏమైనా ఉంటాయా? అనేది చూడాలి. ‘రామాయణ పార్టు 1’ సినిమా చిత్రీకరణ పూర్తినట్లుగా ఆల్రెడీ ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌కపూర్‌ చెప్పాడు. సో..ఫస్ట్‌పార్టు వీఎఫ్‌ఎక్స్‌ పనులతో మేకర్స్‌ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. ఇక ‘రామాయణ’ సినిమా అనౌన్స్‌మెంట్‌పై ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకు హాలీవుడ్‌ ప్రముఖలు కూడా వర్క్‌ చేశారు.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *