12A Railway Colony: అల్లరి నరేశ్ లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘12ఏ రైల్వే కాలనీ’. అల్లరి నరేశ్ తన కెరీర్‌లో తొలిసారిగా చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమా కు షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా, నాని కాసర్లగడ్డ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామాక్షీ భాస్కర్ల, సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శీను, జీవన్ కుమార్, గగన్ విహారి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక అన్నీ నిజాలే మాట్లాడుకుదాం అన్నా…చెప్పు ఎందుకు సంపినావ్….
ఆ మున్నాగాన్నీ నువ్వే చంపినావ్ కదా..!
ఆ మర్డర్ కేసు గురించి, మాట్లాడనీకి వచ్చినా సార్…!
బహుషా..ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవరూ చూసి ఉండరు
కొన్ని కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అవుతుంది.
పై సంభాషణలు ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.