కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా కామెడీ సినిమాలు, ఆ తర్వాత వీలైనప్పుడు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు అల్లు నరేశ్ (Allari Naresh). అలా అల్లరి నరేశ్ కెరీర్‌లో 60 సినిమాలు పూర్తయ్యాయి. లేటెస్ట్‌గా అల్లరి నరేశ్ 63వ సినిమా ఖారారైపోయింది. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్‌ఈ సినిమాకు దర్శకుడు. ఇక అల్లరి నరేశ్ కెరీర్‌లోని ఈ 63వ సినిమాకు ‘ఆల్కహాల్’ (Allari Naresh Alcohol) అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. సోమవారం అల్లరి నరేశ్ బర్త్ డే .ఈ సందర్బంగా ఆల్కహాల్ (Alcohol Movie) సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రుహానీ శర్మ హీరోయిన్‌గా చేస్తున్నారీ సినిమాలో. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైనర్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాకు వెంకట్ ఉప్పు టూరి సహా నిర్మాత. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా కాకుండ…’12ఏ రైల్వేకాలనీ’ అనే ఓ హారర్ మూవీ కూడా చేస్తున్నాడు అల్లరి నరేశ్. ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ అందించిన ఈ సినిమాకు నాని కాసరగడ్డ డైరెక్టర్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, సాయికుమార్, వైవా హర్ష వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా ఒక హాస్య సినిమా, మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్న అల్లరి నరేశ్ ప్రజెంట్ ఈ రెండు డిఫరెంట్ మూవీస్‌యే చేస్తుండటం విశేషం.
మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…అల్లరి నరేశ్ కెరీర్‌లోని సూపర్‌హిట్ ఫిల్మ్ ‘సుడిగాడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘సుడిగాడు 2’ తీస్తానని, కథ రెడీ అవుతోందని అల్లరి నరేశ్ పలుసందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఈ కథ రెడీ కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది.
Read More మంచు విష్ణు కన్నప్ప మూవీ రివ్యూ