హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ మూవీ (AlluArjun – Atlee Movie) గురించి గత కొన్నాళ్లుగా ఎన్నో ఎన్నెన్నో వార్తలు. వీరి కాంబి నేషన్ మూవీ ఉందని, లేదని, అట్లీ వందకోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, ఇలా… ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా అన్నీ అడ్డం కులను దాటుకుని అల్లు అర్జున్– అట్లీ కాంబినేషన్ (AlluArjun – Atlee Movie) లోని మూవీ సెట్స్‌కు వెళ్లనుంది.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (AlluArjun)– అట్లీ (Atlee) కాంబినేషన్‌లోని మూవీని గురించిన అధికారిక అనౌన్స్‌మెంట్ రానుంది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరో అద్భుత ప్రపంచం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందట.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఈ మూవీ ఉండనుందని తెలిసింది. యూఎస్‌లో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్రీకరించారు అల్లు అర్జున్–అట్లీ. రెండ్రో జుల క్రితం ఈ మూవీ ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్‌ను కంప్లీట్ చేసేందుకు చెన్నై వెళ్లొచ్చాడు అల్లు అర్జున్.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డేకి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినా కూడా, షూటింగ్ మాత్రం వేసవి తర్వాతే ప్రారంభం అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక..అల్ సెట్ గో…అనడమేఆలస్యం. అల్లు అర్జున్ కెరీర్‌లో 23వ చిత్రంగా ఈ మూవీ ఉంటుంది. అట్లీ కెరీర్‌లో 6వ చిత్రం.
ఇంకా ఈ మూవీ కవల సోదరులుగా అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అట్లీ డైరెక్షన్‌లోని సినిమాల కథల్లో కవల సోదరుల కాన్సెప్ట్ తరచూ కనిపిస్తుంటుంది. ఉదాహరణగా..అదరింది సినిమాను చెప్పుకోవచ్చు. 2027లోనే ఈ మూవీ రిలీజ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కాబట్టి…వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ కూడా జరగాలి. ఇలా..ఈ మూవీ రిలీజ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుంది.