మహేశ్‌బాబు ప్రజెంట్ రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ 2027లోనే రిలీజ్ అవుతుంది. ఇలా.. మహేశ్‌బాబు మూవీ రెండు సంవత్సరాల వరకు థియేటర్స్‌లోకి రాదు.
సేమ్..అల్లు అర్జున్ మూవీ కూడా మరో రెండు సంవత్సరాలు థియేటర్స్‌లోకి వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సిన అల్లు అర్జున్..సడన్‌గా అట్లీ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తయి, 2026లో రిలీజ్ ఉంటుందని ప్రచారం జరిగింది.
కానీ అల్లు అర్జున్– అట్లీ కాంబినేషన్ మూవీ క్యాన్వాస్ చూస్తుంటే ఏడాదిలో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే ప్రసక్తే లేదు. పైగా అట్లీ మూవీతో పాటుగా, త్రివిక్రమ్ సినిమానూ సమాంతరంగా చేయాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. సో…ఇలా ఏ మూవీ కూడా తొందరగా పూర్తయ్యే చాన్సెస్ లేవు.
అట్లీ సినిమా కావొచ్చు..త్రివిక్రమ్ సినిమా కావొచ్చు…రెండూ భారీ చిత్రాలే. రెండు సినిమాల షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఆ మాటకొస్తే..ఇంకా నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తే కాలేదు. సో.. బన్నీ మూవీ కోసం ఆడియన్స్ మరో రెండేళ్ళు ఆగాల్సిందే.
‘పుష్ప 1’ తర్వాత ‘పుష్ప 2’ రావడానికి మూడేళ్లు పట్టింది. ఇప్పుడు అట్లీ మూవీ థియేటర్స్‌లోకి రావడానికి మరో మూడేళ్లు పట్టిన ఆశ్చర్యం లేదు.