తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ పెద్ద ఎస్సెట్. ఈ సంక్రాంతి పండక్కీ…రెండుమూడు పెద్ద సినిమాలు విడుదలైనా, సరే..ఆ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కుంది. అందుకే.. ..సంక్రాంతి సీజన్‌ను అస్సలు వదులుకోరు తెలుగు దర్శక–నిర్మాతలు. ఆల్రెడీ వచ్చే సంక్రాం తికి కూడా పెద్ద సినిమాలు రెడీ అయిపోయాయి. చిరంజీవి–అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లోని సినిమా సంక్రాంతి రిలీజ్‌కి ఫిక్స్ అయ్యింది. తమిళ హీరో విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ కానుంది. ఇంకా తెలుగులో ఒకట్రెండు పెద్ద సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో మిడ్‌రేంజ్ హీరో నవీన్‌పొలిశెట్టి (Naveenpolishetty)యాక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga oka Raju Release) సైతం సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమైంది. నవీన్‌పొలిశెట్టి హీరోగా చేస్తున్న ఈ మూవీలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమా గ్లింప్స్ విడుదలై, ఆడియన్స్‌కు బాగానే ఏట్రాక్ట్ చేసింది. ఆ నమ్మకంతోనేమో…నాగవంశీ ‘అనగనగా ఒక రాజు’సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా ‘అనగనగా ఒక రాజు’ చిత్రం జనవరి 14 (Anaganaga oka raju Release date) న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘డాకుమహారాజ్’ ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ హీరోగా చేశారు. ఇలా డాకుమహారాజ్ మూవీతో ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన నాగవంశీ, వచ్చే ఏడాది కూడా హిట్ కొట్టాలని ప్లాన్ చేసినట్లు ఉన్నాడు.
మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…నిజానికి అనగనగా ఒక రాజు (Anaganaga oka raju Release) సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. నవీన్‌పొలిశెట్టికి గాయమైంది. దీంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత మొదట ఈ సినిమాకు శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ మీనాక్షీ చౌదరి ఫైన ల్ అయ్యారు. అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో బాగా ఇన్‌వాల్వ్ అయ్యారట నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీజే మేయర్ డైరెక్టర్.