హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi Interview) కాంబినేషన్‌లో ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాల్లో ‘ఎఫ్ 3’ చిత్రం మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు.
దర్శకుడిగా ఇండస్ట్రీలో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఎఫ్ 3’ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించిన స్థాయిలో స్పందన లేకపోవడం గురించి మాట్లాడారు (AnilRavipudi Interview)
‘‘ఎఫ్ 2’ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో ‘ఎఫ్ 3’ (F3)పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ అయితే కథ విషయంలో నేను డిఫరెంట్‌గా ఆలోచించాను. ‘ఎఫ్ 2’ (F2) సినిమా ఎక్కడయితే ఆగిపోయిందో, అక్కడ్నుంచి ‘ఎఫ్ 3’ తీయకుండ, ‘ఎఫ్ 3’ కోసం మరో సినిమా కథను రెడీ చేశాను. నేను ఇలా చేయడానికి కారణం ఉంది. హిందీలో ‘గోల్‌మాల్’ సిరీస్‌లోని ఒక్కో సినిమా, ఒక్కో కథతో ఉంటుంది. నేను కూడా అలా చేద్దామని ‘ఎఫ్ 3’ కోసం మరో కథను అనుకున్నాను. అలా కాకుండ….‘ఎఫ్ 2’ సినిమాలో పెళ్లైన వెంకటేష్, తమన్నాగార్లకు పిల్లలు, వారి ఆలనాపాలనా చూసుకోవడం, వారి మధ్య సన్నివేశాలు…ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ‘ఎఫ్ 2’ కథ రాసుకుని ఉంటే బాగుండేదెమో! అని ఆ తర్వాత అనిపించింది. ‘ఎఫ్ 4’ (F4) విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాను’’ అని మాట్లాడారు.
AnilRavipudi Interview: ఇదంతా నాకు బోనస్!
దర్శకుడిగా ఇండస్ట్రీలో పదేళ్లుగా ఉన్నాను. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది. ఈ పదేళ్లలో నేను వారి ప్రేమను సంపాదించుకున్నాను. వారి ప్రేమ రూపంలో నా ఆస్తి పెరుగుతూ ఉంటుంది. ఇలా నేను శ్రీ మం తుడ్ని. అయితే నేను దర్శకుడి మెగాఫోన్ పట్టి, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు డైరెక్టర్ అనిపించుకుంటే చాలని అనుకున్నాను. నా డ్రీమ్ నా తొలి సినిమా ‘పటాస్’తోనే జరిగిపోయింది. ఇదంతా నాక బోనస్. నన్ను నమ్మి నాకు తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్‌రామ్‌గారు నా సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది.
నా సినిమాల్లో వల్గారిటీ ఉండదు
సంక్రాంతికి వస్తున్నాం (SankrathikiVasthunnam) సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్ నన్ను నమ్మారు. వారికి రుణ పడి ఉంటాను. బుల్లిరాజు క్యారెక్టర్ అనేది ‘పిల్లలను ఓటీటీలకు దూరంగా ఉంచండి’ అని చెప్పడానికి మాత్రమే పెట్టాం. అంతేకానీ…దానిలో ఏం వల్గారిటీ లేదు. నా సినిమాల్లో ఏం వల్గారిటీ ఉండదు. నా కామెడీని టీవీ షోలతో కంపేర్ చేయవద్దు. ఒక వేళ ఆ కామెంట్సే నిజమైతే….కామెడీని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ థియేటర్స్‌కు ఎందుకు వస్తారు? టీవీ షోలనే చూడొచ్చు కదా. అయినా..అక్కడక్కడ ఉండే ఒకశాతం నెగటివిటీని నేను పట్టించుకోను. భారత ప్రధాని నరేంద్రమోదిపై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయినా…ఒక సినిమాకు కలెక్షన్స్ కొలమా నమైనప్పుడు…నేను ప్రతిసారి సక్సెస్ అవుతున్నట్లే కదా.
Venkatesh: ఆల్‌టైమ్ సంక్రాంతి రికార్డు సాధ్యమేనా?
మా నాన్నగారు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
నా ప్రతి సినిమాలోనూ మా నాన్నగారు ఏదో ఒక్క ఫ్రేమ్‌లో అయినా ఉంటారు. అలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చివరి ఫ్రేమ్‌లో కనిపించారు. ‘‘నన్ను నీ సినిమాలో పెట్టుకోకపోతే నీ ఆడదు’ అంటూ సరదాగా మా నాన్నగారు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు.
చిరంజీవితో మూవీ!
చిరంజీవిగారితో సినిమా (ChiruAnil)ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేను. త్వరలోనే వివరాలు చెబుతాం. కచ్చితంగా ఆయన ఇమేజ్‌కు తగ్గ కథనే రెడీ చేస్తాను.