AnilRavipudi: అనిల్‌రావిపూడి కంట్రోల్‌లో మూడు ఫ్రాంచైజీలు!

Viswa
2 Min Read

ప్రజెంట్‌ ‘సంక్రాంతికి వస్తు న్నాం’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. వెంకటేష్‌ హీరోగా, ఐశ్వర్యారాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన ‘సంక్రాంతికి వస్తు న్నాం’ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలై, బ్లాక్‌బస్టర్‌ కొట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో రూ. 100 కోట్ల రూపాయాల షేర్‌ కలెక్ట్‌ చేసిన హీరోల లిస్ట్‌లో వెంకటేష్‌ చేరిపోయారు.

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ దిశగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ క్రమంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్‌గా ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ సినిమా టైటిల్‌ను అనుకుంటున్నామని, భవిష్యత్‌లో సీక్వెల్‌ తీసి, మళ్లీ సంక్రాంతికే రిలీజ్‌ చేస్తామని దర్శకుడు అనిల్‌రావిపూడి చెబుతున్నారు. ఈ ప్రకారం అనిల్‌ చేతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్రాంచైజీ ఉన్నట్లే.

Sankrati2025 winner: హిస్టరీ రిపీట్‌…వెంకటేష్‌ డబుల్‌ విక్టరీ!

ఇక వెంకటేష్‌తోనే ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ సినిమాలు చేసి హిట్స్‌ కొట్టాడు అనిల్‌రావిపూడి. ‘ఎఫ్‌ 3’ చివర్లో ‘ఎఫ్‌ 4’ అనే టైటిల్‌ ఎండ్‌ కార్డు పడుతుంది. పైగా…‘ఎఫ్‌ 4 కే కాదు…ఎఫ్‌ 10’ కూడా చేస్తామని వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్‌మీట్‌లో చెప్పకనే చెప్పారు. దీంతో…అనిల్‌ చేతిలో ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ ఫ్రాంచైజీ ఉన్నట్లే.

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ
Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

ఇక రవితేజతో అనిల్‌రావిపూడి చేసిన ‘రాజా ది గ్రేట్‌’మూవీ సూపర్‌సక్సెస్‌ కొట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే స్కోప్‌ ఉన్నట్లు అనిల్‌ రావిపూడి చెప్పుకొచ్చారు. రవితేజతో గనక అనిల్‌రావిపూడి ‘రాజా ది గ్రేట్‌ 2’ తీసి, హిట్‌ కొడితే ఇది కూడా మరో ఫ్రాంచైజీ అయిపోతుంది. ఇలా మూడు ఫ్రాంచైజీలు అనిల్‌ కంట్రోల్‌లో ఉంటాయి. మరి..అనిల్‌ మనసులో ఏముందో

RifleClub Telugu Review: మలయాళం ఫిల్మ్‌ రైఫిల్‌ క్లబ్‌ రివ్యూ

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *