బెగ్గర్‌ సినిమాలో టబు

Heroine Tabu: విజయ్‌సేతుపతి, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లోని బెగ్గర్‌ మూవీలో టబు ఓ కీ రోల్‌ చేయనున్నారు.

Viswa
1 Min Read
Heroine Tabu in purijagannadh film

Web Stories

వెంకేటష్‌ ‘కూలీ నెంబర్‌ 1’, నాగార్జున ‘ఆవిడా మా ఆవిడే’, బాలకృష్ణ ‘పాండు రంగడు’, చిరంజీవి ‘అందరివాడు’ వంటి సినిమాలతో టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాస్త గ్యాప్‌ తీసుకున్న టబు (Heroine Tabu)…మళ్లీ అల్లు అర్జున్‌ ‘అల..వైకుంఠపురములో…’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

మళ్లీ ఇప్పుడు మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశారు. విజయ్‌సేతుపతి హీరోగా పూరీ జగన్నాథ్‌ ఓ సరికొత్త సినిమాను తీయబోతున్నాడు. ఈ సినిమాకు బెగ్గర్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీలోనే టబు ఓ లీడ్‌ రోల్‌ చేస్తారు. గురువారం అధికారికంగా ప్రకటించారు. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషలతో పాటుగా, ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తారు. ఇంకా…ఈ మూవీని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌ నిర్మిస్తారు. ‘లైగర్, డబుల్‌ ఇస్మార్ట్‌’ వంటి సినిమాల పరాజయాల తర్వాత పూరీ జగన్నాథ్‌ ఎలాంటి సినిమా తీస్తారో అన్న ఆసక్తి ఆడియన్స్‌లోనూ నెలకొని ఉంది.

 

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu