విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. మరో రెండు వారాల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ను మెల్లిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ‘కింగ్‌డమ్’ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అంతా బాగానే ఉంది. విజయ్ ఓ పోలీసాఫీసర్ అని, ఓ మిషన్ కోసం జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఆ మిషన్ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సి ఉంటుందని అంతా అనుకున్నారు.
కానీ ‘కింగ్‌డమ్’ సినిమా నుంచి లేటెస్ట్ వచ్చిన ‘అన్నా అంటేనే..’ పాట లిరికల్ వీడియో….’కింగ్‌డమ్’ సినిమాలో ఉన్న మరో కోణాన్ని బయటకు తీసింది. కింగ్‌డమ్ లో మంచి యాక్షన్ యే కాదని, మంచి ఎమోషనల్ కనెక్ట్ కూడ ఉందని తెలుస్తోంది. ‘కింగ్‌డమ్’ సినిమా నుంచి అన్నా అంటేనే..పాట రాగానే, ఈ సినిమాలోని అన్నదమ్ముల బంధం హైలైట్‌గా కనిపిస్తోంది. ఈ కింగ్‌డమ్ సినిమాలో అన్నదమ్ముల్లా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కనిపిస్తారు. శివ పాత్రలో సత్యదేవ్, సూరి పాత్రలో విజయ్ కనిపిస్తారు. ఓ పోలీస్ కుటుంబం కథగా ‘కింగ్‌డమ్’ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ‘కింగ్‌డమ్’ సినిమా నుంచి విడుదలైన ‘అన్నా అంటేనే..’ పాట మాత్రం ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుటుంది. క్రిష్ణకాంత్ లిరిక్స్ బాగున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వాయిస్ ఈ సినిమాకు ప్రాణం పోసినట్లుగా ఉంది.
చిన్న తనమే ఏమైపోయే..
నన్ను వదిలే నీదే చేయే..
అంత కలలాగే కరిగే…
కథ కలగక ఆగే….
అందమైన గూడే చెదిరే..
కష్టమోచ్చిన ఇంకో వైపే…
కంటిరెప్పల కాసే కాపే
కొన్ని గుర్తులెవో మిగిలే…
విధి ఎరుగదు జాలే..
చిన్ని గుండె నాదే పగిలే..
అన్నా అంటేనే…ఉన్నానంటూనే…నిలబడతావే…
అన్నా అంటేనే…ఉన్నానంటూనే…కలబడతావే…
నిజానికి…ఈ అన్నా అంటేనే…పాటను ముందుగా వేరే సింగర్స్‌తో పాడించారు. కానీ నాగవంశీ ఇంప్రెస్ కాలేదు. దీంతో ఫైనల్‌గా మళ్లీ అనిరుధ్‌యే పాడాల్సి వచ్చింది. ఇలా నాగవంశీ నిర్ణయమే కరెక్ట్ అయ్యింది. సాంగ్‌కు అనిరుధ్ వాయిస్ బాగానే ఉంది.
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లోని ఈ కింగ్‌డమ్ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. గోపరాజుమరమణ ఈ సినిమాలో అన్నదమ్ములు విజయ్-సత్యదేవ్‌ల ఫాదర్‌గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ‘తడాఖా, దడ, రంగస్థలం, రేసుగుర్రం, బాహుబలి’ వంటి సినిమాలు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంతో వచ్చాయి. ఈ తరుణంలో ఈ తాజా చిత్రం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఆడియన్స్‌లో ఉంది.