అనుష్క పెళ్లి పాట…మోగింది సన్నాయి.. సైలోరే

Kumar NA

అనుష్కాశెట్టి (Aanushkashetty) పెళ్లి పాట అంటే…రియల్‌ లైఫ్‌లో కాదండి..బాబు. రీల్‌ లైఫ్‌లోనే. ఇంతకీ… విష యం ఏంటం టే…అనుష్కాశెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి (Ghaati)’. తమిళ నటుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నాడు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) సినిమాకు దర్శకుడు. ‘షూటి’ సినిమా జూలై 11న రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో, మేకర్స్‌ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఈ ప్రమోషన్స్‌లో తొలి అడుగుగా ‘ఘాటి’ సినిమాలోని ‘సైలోరే..’ (Sailore Ghaati)పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

ఈ పాటకు ఈ చిత్రం దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ లిరిక్స్‌ రాయడం ఓ విశేషం అయితే…ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ నాగెవెల్లి విద్యాసాగర్‌ ఈ పాటను సింగర్‌ లిప్సికాతో కలిసి పాడటం మరో విశేషం. అనుష్కా శెట్టి, వెంకట్‌ ప్రభుల పెళ్లి నేపథ్యంలో వచ్చే ఓ ఫోక్‌ సాంగ్‌ లిరిక్స్, (Ghaati Sailire Song) ఈ సాంగ్‌ గ్రాండియర్‌గా ఉండేట్లు కనిపిస్తుంది. వందల సంఖ్యలో బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్టు లు ఈ సాంగ్‌లో కనిపిస్తున్నారు. బాగా ఖర్చుపెట్టి, ఈ సిని తీస్తున్నట్లుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ సమర్పస్తున్న చిత్రం ఇది.

వ్యాపారరంగంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న ఓ మహిళను కొందరు వ్యక్తులు కలిసి, నమ్మించి మోసం చేస్తారు. ఈ వంచన నుంచి తేరుకుని, తనను మోసం చేసిన వారిపై పగ తీర్చుకుని, ఓడిపోయిన వ్యాపార రంగంలోనే మళ్లీ రాణిగా ఎదిగే ఓ మహిళ వీరోచిత పోరాటం నేపథ్యంగా ‘ఘాటి’ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలిసింది. గతంలో క్రిష్, అనుష్కాశెట్టిలు కలిసి ‘వేదం’ అనే సినిమాకు వర్క్‌ చేశారు. మళ్లీ ఇప్పుడు ‘ఘాటి’ సినిమాకు కలిసి వర్క్‌ చేశారు. ‘ఘాటి’ సినిమాను తొలుత ఏప్రిల్‌ 17న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ…జూలై 11న థియేటర్స్‌లో రిలీజ్‌కు సిద్ధమైంద

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *