ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా ఎంట్రీ అధికారికంగా ఖరారైపోయింది (Australian Cricketer Daivd Warner in Robinhood). నితిన్, శ్రీలీల హీరోయిన్స్‌గా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ (Robinhood)లో డేవిడ్ వార్నర్ ఓ రోల్‌లో యాక్ట్ చేశారు. రాబిన్‌హుడ్ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు డేవిడ్ వార్నర్ షూటింగ్‌లో పాల్గొన్నారు.
తెలుగు వాళ్లకు సుపరిచితుడే
ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ద్వారా, మరీ ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆడినప్పుడు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అభిమానులకు దగ్గర అయ్యారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా వీడియోలను తన ఇన్‌స్ట్రాలో ఎక్కువసార్లు షేర్ చేశాడు డేవిడ్ వార్నర్. దీంతో ఆయన ‘పుష్ప’లో గెస్ట్ రోల్ చేశారన్న ప్రచారం సాగింది. ఫైనల్‌గా డేవిడ్ వార్నర్ యాక్ట్ చేసింది ‘రాబిన్‌హుడ్’ సినిమాలో అన్నది నిజమైంది.
భీష్మ తర్వాత….
భీష్మ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘రాబిన్‌హుడ్’. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించారు. ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్’ తర్వాత నితిన్, శ్రీలీల మళ్లీ ‘రాబిన్‌హుడ్’ కోసమే యాక్ట్ చేశారు. 2024లో ఈ మూవీని డిసెంబరులో రిలీజ్ ప్లాన్ చేశారు. ఫైనల్‌గా 2025 మార్చి 28న రిలీజ్ చేస్తున్నారు.
కథ ఏంటో..!
ఇండియాలోనే హై లెవల్ సెక్యూరిటీ సంస్థను రన్ చేస్తుంటాడు రాజేంద్రప్రసాద్. ఓ కారణంగా శ్రీలీల (మీరా పాత్ర) ఇండియాకు వస్తుంది. శ్రీలీలకు సెక్యూరిటీగా ఉండేందుకు నితిన్ నియమిస్తాడు రాజేం ద్రప్రసాద్. ఈ క్రమంలో ఏం జరిగింది. మీరా ఇండియాకు ఎందుకు వచ్చింది అన్నదే స్టోరీ అట.
గట్టి బాక్సాఫీస్ పోటీ
రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతున్న రోజునే…మరో యూత్‌ఫుల్ ఫిల్మ్ ‘మ్యాడ్ 2’ రిలీజ్ అవుతోంది. ఇంకా విక్రమ్ ‘వీరధీరశూర’, మోహన్‌లాల్ ‘ఎంఫురాన్ (లూసీఫర్ 2)’ వంటి చిత్రాల కూడా రిలీజ్ అవు తున్నాయి. సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ కూడా ఉంది. మరి…ఈ సినిమాల మధ్య ‘రాబిన్‌హుడ్’ ఎలాంటి రిజల్ట్‌ను తెచ్చుకుంటుందో చూడాలి.